Olympics 2024 : పంచులతో అదరగొట్టి.. క్వార్టర్స్ కు చేరి.. పతకానికి అడుగుదూరంలో లవ్లీనా పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. మహిళల 75 కిలోల విభాగంలో సున్నివా హాఫ్‌స్టాడ్‌ను 5-0 తో ఓడించింది. క్వార్టర్స్‌లో నెగ్గి సెమీస్ చేరుకుంటే లవ్లీనా మరో పతకం ఖాయం చేసినట్టే. By Anil Kumar 31 Jul 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Olympics 2024 : ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించి మరో పతకం దిశగా అడుగులు ముందుకు వేసింది. మహిళల 75 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్ పోరులో భాగంగా తన ప్రత్యర్థి సున్నివా హాఫ్‌స్టాడ్‌ను 5-0 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఈ విజయం భారత క్రీడా ప్రేమికులందరిలో ఆనందాన్ని నింపింది. లవ్లీనా యొక్క ఈ అద్భుత ప్రదర్శన భారతదేశానికి మరో పతకం రాబట్టే అవకాశాన్ని మరింత పెంచింది. లవ్లీనా బోర్గోహైన్ ఎవరు? అస్సాం (Assam) కు చెందిన లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) భారతదేశం (India) లోని అత్యంత ప్రతిభావంతులైన బాక్సర్లలో ఒకరు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి దేశానికి గర్వకారణమైంది. తన అద్భుతమైన పంచ్‌లతో ద్వారా ప్రత్యర్థులను తేలికగా ఓడిస్తూ ప్రస్తుత ఒలింపిక్స్ లోనూ అదరగొడుతుంది. A 𝑳𝒐𝒗𝒍𝒊 PERFORMANCE FROM THE CHAMP!! 🥊 She punches her way into the Quarter-Finals 😤 💪 Stream the action on #JioCinema for FREE. Also, watch it LIVE on #Sports18!#Cheer4Bharat #OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Paris2024 #Boxing pic.twitter.com/j5ogV5iWmQ — JioCinema (@JioCinema) July 31, 2024 Also Read : లక్ష్య సేన్ అద్భుతం.. ప్రీ క్వార్టర్స్‌కు చైనా బాక్సర్ తో.. ఒలింపిక్స్‌కు ముందు వరకూ పామ్ లేమితో సతమతమైన లవ్లీనా.. కీలక టోర్నీలో మాత్రం సత్తా చాటుతూ భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసే దిశగా ముందుకు సాగుతోంది. కాగా లవ్లీనా క్వార్టర్స్‌లో టాప్ సీడ్ చైనా బాక్సర్ లి ఖియాన్‌తో తలపడనుంది. ఆగస్టు 4న ఈ మ్యాచ్ జరుగనుంది. #lovlina-borgohain #paris-olympics-2024 #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి