చైనాలో ఓ వ్యక్తి తన ప్రేయసికి ఊహించని షాక్ ఇచ్చాడు. వివాహానికి ముందే ఆమెకు ప్లాట్ కొనివ్వాలని యువతి తల్లిదండ్రులు అతనికి షరతు పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని సదరు బాయ్‌ఫ్రెండ్ ఓ ప్లాన్ వేశాడు. రూ. 80 లక్షల నికిలీ నోట్లను సూట్‌కేసులో పెట్టి యువతికి అందజేశాడు.
ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని వెళ్లిన గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని షాక్ తగిలింది. అది నకిలీ కరెన్సీ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బ్యాంకు సిబ్బంది. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు సూట్‌కేస్‌ను తెరిచి చూడగా.. పైన కొంతమేర అసలు నోట్లు పెట్టి మిగతా అంతా నకిలీ నోట్లతో నింపేసినట్లు గుర్తించారు.
ఇక ఇలా నకిలీ కరెన్సీని కలిగి ఉన్నందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించిన సదరు వ్యక్తి.. గర్ల్‌ఫ్రెండ్ పేరెంట్స్ పెట్టిన కండిషన్‌ను తీర్చడానికి తనవద్ద అంత భారీ మొత్తం లేకపోవడంతో ఇలా ఫేక్ కరెన్సీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.