Telangana Crime: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వారి వివరాల్లో వెళ్తే... ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్పహాడ్కి చెందిన సంజయ్ (26), నాగజ్యోతి (24) గత కొద్దిరోజులుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరు యువతీయువకుల ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ జంట చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి వీరు మళ్లీ తిరిగి రాలేదు. ఆ తర్వాత వీరద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయం వీరి శవాలు వెలుగు చూశాయి. ఆత్మహత్య ఘటన తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సింది.
ఇది కూడా చదవండి: ఐరన్ లోపం ఉందా..? తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే