Weight Lose: శీతాకాలంలో ఎక్కువగా ఆకలి అవుతూ ఉంటుంది. అతిగా తినడం వల్ల మన బరువు పెరగడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితిలో బరువును తగ్గించుకోవడానికి మీ ఆహారంలో ఈ 5 రకాల పిండిలను చేర్చుకోండి.పెరుగుతున్న పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం, బీపీ, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. ఊబకాయం ఈ సమస్యలలో ప్రధానమైనదిగా చెప్పవచ్చు.బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గించుకోవడానికి కొందరు జిమ్‌లు, వ్యాయామాలు చేస్తుంటారు. మరికొందరు డైట్ సహాయంతో బరువును తగ్గించుకుంటారు. ఈ పిండి పదార్థాలను మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.
జొన్న పిండి
- ఆరోగ్యానికి మరియు మెదడుకు చాలా జొన్న పిండి ఉపయోగకరంగా ఉంటుంది. మాంసకృత్తులు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఇందులో ఉంటాయి. వంటల్లో ఇది వాడితే బరువు తొందరగా తగ్గుతారు. ఎందుకంటే ఇది ఎక్కువ సమయం మన కడుపును నిండుగా ఉంచుతుంది. దాంతో ఆకలి వేయదు.
మిల్లెట్ పిండి
- బజ్రా పిండిలో గ్లూటెన్ ఫ్రీ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి గొప్ప ఎంపిక. అంతేకాకుండా ఇది తక్కువ గ్లైసెమిక్‌ను కలిగి ఉంటుంది. మన రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది.
సంఘాడాల పిండి (Water chesnuts)
- తరచుగా ఉపవాసం సమయంలో ఉపయోగించేవి సంఘాడాలు. వీటి పిండి బరువు తగ్గడంలో బాగా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. మంచి శక్తిని ఇస్తుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
వోట్ పిండి
- బరువు తగ్గడానికి వోట్స్‌ను ఎక్కువ మంది వాడుతుంటారు. పిండి పదార్థాలు మరియు పీచుపదార్థాలు వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ పిండి మీకు మంచి శక్తిని అందిస్తుంది. ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలగజేస్తుంది. దీంతో ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటాం.
ఇది కూడా చదవండి: తరచూ ఆవలింతలు వస్తున్నాయా..వీటిని ఆపేదెలా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.