Shivaratri : శివరాత్రి రోజున పరమాత్మునికి ఎలాంటి నైవేధ్యాలు సమర్పించాలంటే!

శివరాత్రి రోజున శివయ్యకు బెల్లం పెడితే చాలు.. జీవితంలో ఉన్న కష్టసుఖాలను అన్నిటిని ఆయన పంచుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరునికి బెల్లం పెట్టినంతనే చాలు ఆయన వరాలు మీ మీదనే ఉంటాయి. ఇంట్లోనే తయారు చేసిన తీపి బెల్లం వంటకాలను పరమేశ్వరునికి సమర్పించాలి.

Shivaratri : శివరాత్రి రోజున పరమాత్మునికి ఎలాంటి నైవేధ్యాలు సమర్పించాలంటే!
New Update

Maha Shivaratri 2024 : సకల దేవతలు కొలిచే పరమ శివుని భక్తితో కొలిచే మహా శివరాత్రి(Maha Shivaratri) నేడు. సర్వ జగత్తు ఆ పరమ శివుడిని భక్తితో కొలిచేందుకు సిద్దమవుతున్నారు. శివరాత్రి అంటే ఒక రోజు ముందు నుంచే పండుగ కార్యక్రమాలు మొదలైపోతాయి. ఉపవాసం, జాగరణ వంటి ఆచారాలను ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు.

శివరాత్రి రోజున చేసే పుణ్యాల వల్ల సకల జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసిస్తారు. ఇక శివరాత్రి పర్వదినాన పరమాత్ముడికి ఇష్టమైన ప్రసాదాలు, నైవేద్యాల ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చెంబుడు నీరు పోసినంతనే చాలు పరమశివుడు(Lord Shiva) ప్రసన్నం అయిపోయి భక్త ప్రియునిగా భక్తులకు దాసుడైపోతాడు.

శివరాత్రి రోజున శివయ్యకు బెల్లం(Jaggery) పెడితే చాలు.. జీవితంలో ఉన్న కష్టసుఖాలను అన్నిటిని ఆయన పంచుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరునికి బెల్లం పెట్టినంతనే చాలు ఆయన వరాలు మీ మీదనే ఉంటాయి. బయట సమర్పించే మిఠాయిలు కాకుండా ఇంట్లోనే తయారు చేసిన తీపి బెల్లం వంటకాలను పరమేశ్వరునికి సమర్పించాలి.

పరమేశ్వరునికి పంచామృతం అంటే ఎంతో ఇష్టం. సాధారణంగా శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పంచామృతంలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఉపయోగిస్తారు. వేడుక ఏదైనా సరే స్వామి వార్లకు పాయసం, పరమాన్నం కచ్చితంగా ఉండాల్సిందే. వీటితో పాటు అటుకులతో చేసిన క్షీరాన్నం అన్న పరమాత్మునికి మహా ప్రీతి.

Also Read : శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ విషయాలను విస్మరించకండి..ఈ రోజున ఏం చేయాలి..ఏం చేయకూడదంటే!

#lord-shiva #jaggery #maha-shivaratri-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe