KCR: అసెంబ్లీలో కేసీఆర్ గది మార్పు.. బీఆర్ఎస్ నేతలు సీరియస్

అసెంబ్లీలో కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాబీలో BJLP కార్యాలయం పక్కన LOP రూమ్‌ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు అసంతృత్తి వ్యక్తం చేశారు. స్పీకర్‌ను కలిసి పాత రూమ్‌నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

New Update
KCR: కేసీఆర్‌కు భారీ షాక్.. ఫౌమ్ హౌజ్‌లో తనిఖీలు చేసి సీజ్ చేయాలని డీజీపీకి కంప్లైంట్!

KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే అభివృద్ధి పనులు, అమలు చేయబోయే పథకాలపై వివరణ ఇచ్చారు. ఆరు గ్యారెంటీల పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government).. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేసిందని.. మరో రెండు పథకాలను ఈ నెల నుంచే అమలు చేస్తుందని గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు.

ALSO READ: మహేందర్ రెడ్డిని TSPSC చైర్మన్‌గా తొలిగించాలి.. కవిత డిమాండ్

కేసీఆర్‌కు షాక్...

అసెంబ్లీ సమావేశలు ప్రారంభమైన మొదటి రోజే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . లాబీలో BJLP కార్యాలయం పక్కన లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు రూమ్‌ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో స్పీకర్ ఛాంబర్‌కు ఎడమ వైపు ఇన్నర్ లాబీలో ఎల్ఓపీ కార్యాలయం ఉండేది. దీంతో కేసీఆర్ లీడర్ ఆఫ్ అపోజిషన్‌ కాబట్టి ఇకపై ఆయన ప్రభుత్వం కేటాయించిన రూమ్ లోనే కార్యాచరణ చేయనున్నారు.

మేము ఒప్పుకోము.. BRS నేతలు..

కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ నేతలు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కావాలనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత గదిని ఎలా మారుస్తారని BRS లీడర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ను కేటీఆర్, హరీష్‌రావు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. గత ఆనవాయితీనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లుండి అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ రానున్నారు.

ALSO READ: ఈ నెల 16న వ్యూహం సినిమా రిలీజ్

DO WATCH: 

Advertisment
తాజా కథనాలు