Look Out Notice For Ravindran: బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌పై లుకౌట్ నోటీసు జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీఓఐ(బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్)ని కోరింది. బైజూస్ చీఫ్ దేశం విడిచి వెళ్లకుండా చూసుకోవాలని కేంద్ర ఏజెన్సీ BOIని కోరింది. ప్రస్తుతం బెంగళూరులోని ఈడీ కార్యాలయం రవీంద్రన్‌పై విచారణ జరుపుతోంది.
టాప్ నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయిన కంపెనీ:
రవీంద్రన్‌పై విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బైజూస్ కంపెనీ విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఫెమా కింద ఆరోపించిన ఉల్లంఘనలపై థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్(బైజూ మాతృ సంస్థ), రవీంద్రన్‌లకు ఈడీ గత సంవత్సరం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు పెద్ద ఎత్తున కోచింగ్ క్లాసులు, స్టడీ మెటీరియల్ అందించడానికి బైజు రవీంద్రన్ తన ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. విదేశీ కంపెనీలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఒకానొక టైమ్‌లో రవీంద్రన్ కంపెనీ బైజూస్ ఓ వెలుగు వెలిగింది. అయితే అకస్మాత్తుగా బైజూ సంస్థ పరిస్థితి దిగజారింది. తన ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేని పరిస్థితికి వచ్చేసింది. ఆ సమయంలో బైజూ రవీంద్రన్ తన ఆస్తిలో కొంత భాగాన్ని విక్రయించి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది.
బోర్డు నుంచి తొలగిస్తారా?
ఇటివలి కాలంలో రవీంద్రన్‌కు దెబ్బమీదదెబ్బలు తగులుతున్నాయి. ఇక రేపు(ఫిబ్రవరి 23) బైజూస్ కంపెనీ వాటాదారుల EGM జరగనుంది. ఈ సమావేశంలో రవీంద్రన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ EGMలో రవీంద్రన్, ఆయన భార్యను బోర్డు నుంచి తొలగించే ప్రతిపాదన గురించి చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే అతి ఆయనకు మరింత ఎదురుదెబ్బ. ఈ EGMకి ముందే రవీంద్రన్‌పై ED లుకౌట్ నోటీసు సర్క్యులర్ జారీ చేయడం ఆయన కష్టాలను మరింత పెంచింది.
Also Read: అంబానీ AI చాట్‌బాట్ ‘హనుమాన్’ రెడీ.. OpenAI చాట్‌జిపిటికి దబిడి దిబిడే!
ALSO WATCH: