Loksabha today:మూడు న్యాయసంహిత బిల్లులకు లోక్ సభలో ఆమోదం

పాత చట్టాలు పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయసంహిత బిల్లులకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది.

New Update
CAA Notification : లోక్‌సభ ఎన్నికలకు ముందు  మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. సిఎఎ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్.!

బ్రిటీష్ కాలం నాటి న్యాయ చట్టాలకు కాలం చెల్లింది. కొత్త చట్టాలు త్వరలో అమల్లోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి 3 కొత్త క్రిమినల్ చట్టాల బిల్లులకు లోక్‌సభలో ఈరోజు ఆమోద ముద్ర పొందాయి. ఇండియన్ పీనల్ కోడ్ - ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ - సీఆర్‌పీసీ, సాక్ష్యాల చట్టం - ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను ప్రవేశపెట్టింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టం పేరుతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ 3 బిల్లులపై దిగువ సభలో చర్చ జరిగిన తర్వాత మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు.

Also read:రాజకీయాల్లోకి కంగన.. ఆ పార్టీనుంచే పోటీ చేస్తుందంటూ తండ్రి క్లారిటీ

ఈ బిల్లుల మీద ఈ రోజు లోక్ సభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రసంగించారు. ఇకమీదట మూకదాడి ఘటనల్లో దోషిగా తేలిన వారికి మరణశిక్ష విధించే నింబధన ఈ బిల్లుల్లో ఉందని చెప్పారు. ఇక స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశ ద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ కొత్త బిల్లుల్లో శిక్షలకు బదులుగా న్యాయంపై దృష్టి సారించేలా దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ మూడు కొత్త చట్టాలను మొదటిసారి కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు వాటినే మళ్ళీ సవరించి కొత్తగా లోక్ సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త చట్టాలతో పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతంగా, జవాబుదారీతనంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు