/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/LS-Elections-jpg.webp)
Lok Sabha Elections Second Phase : ఈసారి లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) ఏడు దశలుగా జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్1 వరకు వరుసగా ఏడు దశల్లో వీటిని నిర్వహించనున్నారు. ఇందులో మొదటి దశ ఏప్రిల్ 19న జరిగే మొదటి దశకు కొన్ని రోజుల క్రితమే నామినేషన్ల స్వీకరణ మొదలైపోయింది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. ఇప్పుడు రెండవదశ పోలింగ్(Second Phase Poling) కు సంబంధించి కూడా నామినేషన్ల స్వీకరణ మొదలవనుంది. ఈరోజు నుంచి 12 రాష్ట్రాల్లో అభ్యర్ధులు నామినేషన్లను సమర్పించవచ్చును.
12 రాష్ట్రాలు...
రెండో దశలో అసోం, బీహార్, ఛత్తీస్‌ఘడ్, జమ్మూకాశ్మీర్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడి అభ్యర్ధులు ఈరోజు నుంచి ఏప్రిల్ 4 వరకు నామినేషన్ల(Nominations) ను దాఖలు చేసుకోవచ్చును. ఏప్రిల్ 5వ తేదీ నుంచి నామినేషన్లను పరిశీలిన ఉంటుంది. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం 6వ తేదీన జరగనుంది. ఇక అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 8.
2024 आम चुनाव के दूसरे चरण का शेड्यूल👇#Elections2024 #ChunavKaParv #DeshKaGarv #IVote4Sure #ECI pic.twitter.com/Ied0YMcgXd
— Election Commission of India (@ECISVEEP) March 27, 2024
రెండు రాష్ట్రాల మీద ఆసక్తి..
రెండోదశ ఎన్నికల్లో బెంగాల్, మణిపూర్‌ల మీదనే అందరి దృష్టీ ఉంది. ఇందులో ఇన్నర్ మణిపూర్(Manipur) లో మొదటి దశలో ఎన్నికలు జరుగుతుండగా...ఔటర్ మణిపూర్‌లో రెండో దశలో జరగనున్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుండడం, పరిస్థితులు బాగోలకపోవడంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణ కాస్త టఫ్‌గా మారే అవకాశం ఉంది. ఇక బెంగాల్ విషయానికి వస్తే ఇక్కడ అధికార టీఎంసీ, బీజేపీల మధ్య వార్ నడుస్తోంది. అధికారాన్ని మళ్ళీ తామే దక్కించుకోవాలని టీఎంసీ భావిస్తుండగా... బెంగాల్‌ను తమ హస్తగతం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని బీజేపీ అనుకుంటోంది. దీంతో ఈ సారి ఈ రెండు పార్టీల మధ్యా గట్టి పోటీ ఉండనుంది.
Also Read : IPL-2024 : కొత్త సూర్యుళ్ళు ఉదయించారు.. సన్‌రైజర్స్ మారిపోయారు