/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/nallapureddy-rtv-interview--jpg.webp)
Vemireddy : తాను గెలిస్తే కోవూరును అవినీతి రహిత నియోజకవర్గంగా మారుస్తానని టీడీపీ(TDP) అభ్యర్థి వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి(Vemireddy Prashanti Reddy) అన్నారు. ఆర్టీవీ(RTV) కి ఆమె ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. డబ్బు కోసం తాము రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఓడి పోతాడని భయపడే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కోవూరు ఎమ్మెల్యే పట్ల ప్రజలు విసిగి పోయారన్నారు. ఈ సారి ఎన్నిక(Elections) ల్లో ప్రజలు ఇక్కడ టీడీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు తనను ఎన్ని మాట్లాడినా పట్టించుకోనన్నారు. తనకు సంస్కారం ఉందని.. ఒకరిని ఇబ్బంది పెట్టే పనులు చేయనన్నారు. ప్రశాంతి రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.