Lok Sabha Elections 2024: తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికెన్ని.. రవిప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారంటే?

తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

New Update
Lok Sabha Elections 2024: తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికెన్ని.. రవిప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారంటే?

Prashant Kishor On Telangana MP Elections: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీ గెలిచేదెన్ని? తదితర విషయాలపై ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రవిప్రకాష్ తో ఆయన తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ ల మధ్య పోటీ నువ్వా..నేనా అన్నట్లుగా ఎన్నికలు ఉంటాయని తెలిపారు.

publive-image

బీఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. పోటీ ప్రధానంగా బీజేపీ-కాంగ్రెస్ మధ్యనే ఉంటుందన్నారు. ఈ రెండు పార్టీలు చెరి సగం సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. రెండు మూడు సీట్లు అటూ ఇటూ కావచ్చు కానీ.. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి దేశవ్యాప్తంగా 220 సీట్లకంటే ఎక్కువ రావని చెప్పారనే విషయంపై ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాన్ని రవిప్రకాష్ కోరగా.. తాను ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తే అలా అనిపించడం లేదని చెప్పారు. తన అభిప్రాయం ప్రకారం బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. 

కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఓడిపోయినా.. మళ్ళీ ఐదేళ్ల కాలంలో బలంగా పుంజుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కూడా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ పుంజుకోవచ్చన్నారు. ఎప్పటిలోగా బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుంది అని రవిప్రకాష్ అడిగిన ప్రశ్నకు.. “అది ఆ పార్టీ నాయకుల తీరుపై ఆధారపడి ఉంటుంది. వారు ఎంత తొందరగా తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సరిదిద్దుకోగలరు అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. పదేళ్ల అధికారం తరువాత వచ్చిన ఓటమి ఇప్పుడిప్పుడే వాళ్లకి జీర్ణం అవుతోంది. సర్దుకోవడానికి సమయం పట్టొచ్చు.” అంటూ ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. 

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు