Ravi Prakash : జహీరాబాద్.. 2009లో ఏర్పాటైన జహీరాబాద్(Zaheerabad) లోక్‌సభ సీటు భిన్నమైన సాంస్కృతిక నేపథ్యం కలిగిన జిల్లా. వెనుకబడిన ప్రాంతాలుగా పేరున్న నారాయణ్‌ఖేడ్, ఆందోల్, జుక్కల్ వంటి ప్రాంతాలున్న నియోజకవర్గం. మహారాష్ట్ర కల్చర్(Maharashtra Culture) తోపాటు భిన్నమైన వెనుకబడిన జాతుల కలయిక ఈ నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్ దిగ్గజనేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) ప్రాతినిధ్యం వహించిన పాత మెదక్ నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలిపుడు జహీరాబాద్ లోక్‌సభ సీటు పరిధిలో వున్నాయి.
2019లో బీఆర్ఎస్ అభ్యర్ధి బి.బి.పాటిల్ గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మదన్‌మోహన్‌రావు రెండో స్థానానికి పరిమితం అయ్యారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బి.బి.పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్
సురేష్ షెట్కార్ - కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ఎంపీ.
బీజేపీ
బి.బి.పాటిల్ - పదేళ్లుగా బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ. ఆఖరు నిమిషంలో బీజేపీ(BJP) లో చేరి టికెట్ దక్కించుకున్నారు.
బీఆర్ఎస్
గాలి అనిల్ కుమార్ - బలమైన బీసీ నేత. చాలా కాలం కాంగ్రెస్‌లో కొనసాగి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరారు.
గెలిచే అవకాశం: బీజేపీ
Also Read : తూర్పు గోదావరి జిల్లాలో భారీ నగదు సీజ్
రీజన్స్:
1) సిట్టింగ్ ఎంపీ కావడం బి.బి.పాటిల్‌కు పెద్ద అడ్వాంటేజ్. ఆందోల్, జహీరాబాద్ మినహా.. మిగిలిన అయిదు సెగ్మెంట్లలో ప్రభావం.
2) మోదీ కరిష్మా ప్రభావం చూపుతుంది.
3) జహీరాబాద్, ఆందోల్ కాంగ్రెస్‌కు అనుకూలం. మిగిలిన 5 సెగ్మెంట్లు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి.
4) కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ గతంలో ఎంపీగా ఇక్కడ్నించి గెలిచినా.. ఇపుడు సొంత సెగ్మెంట్ నారాయణ్ ఖేడ్‌లోను కష్టపడుతున్నాడు.
5) సంఘ్ పరివార్ సంస్థలు బలంగా వుండడం బీజేపీకి సానుకూలాంశం.