Telangana : ఆదిలాబాద్(Adilabad) తర్వాత తెలంగాణ తలాపున వుండే పెద్దపల్లి లోక్‌సభ(Lok Sabha) సీటు కాకా వెంకట స్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ ప్రభావం గత పదేళ్ళ రాజకీయాలు ఇక్కడ ప్రభావితం చేసింది. మహారాష్ట్ర బోర్డర్‌లో వున్న పెద్దపల్లి లోక్‌సభ సీటు నార్త్, సౌత్ ఇండియా గేట్ వే(South India Gate Way) గా కనిపిస్తోంది. ఓవైపు పారిశ్రామిక ప్రాంతం.. ఇంకోవైపు సింగరేణి నల్ల బంగారం గనులు.. పెద్దపల్లి లోక్‌సభ సీటు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.
2019లో బీఆర్ఎస్(BRS) అభ్యర్ధి బి.వెంకటేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఆగం చంద్రశేఖర్ రెండో స్థానంలో నిలిచారు.
2024లో కాంగ్రెస్(Congress) నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్
గడ్డం వంశీకృష్ణ - కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు.
బీజేపీ
గోమాస శ్రీనివాస్ - ఏబీవీపీ నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో కొనసాగి, ఇటీవల బీజేపీలో చేరారు.
బీఆర్ఎస్
కొప్పుల ఈశ్వర్ - తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. రాష్ట్ర మంత్రిగా, చీఫ్ విప్‌గా పనిచేశారు.
Also Read : హైదరాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ.
రీజన్స్:
1) కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి, పెదనాన్నతోపాటు సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, మంత్రి శ్రీధర్ బాబు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
2) నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు.
3) వెంకటస్వామి కాలం నుంచి కాకా కుటుంబానికి బాగా పట్టుంది. దానికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం ప్లస్ అవుతోంది.
4) తాత వెంకటస్వామి 4 సార్లు, తండ్రి వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎంపీగా ఇక్కడ్నించి ప్రాతినిధ్యం వహించడం ప్లస్ పాయింట్
5) ప్రత్యర్థుల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్‌కు బీఆర్‌ఎస్ తుడిచిపెట్టుకుపోవడం పెద్ద మైనస్ అయ్యింది. ధర్మపురి ఒక్కటే ఆయనకు కొంచెం ఎడ్జ్ ఇచ్చే అవకాశం వుంది
6) బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆఖరు నిమిషంలో పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నారు. పెద్దగా ప్రభావం లేదు.