Telangana Game Changer : నల్గొండలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Telangana Game Changer : నల్గొండలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

Nalgonda : నల్గొండ.. వామపక్ష ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా. తెలంగాణ(Telangana) సాయుధ పోరాట కాలంలో తెగువ చూపిన ప్రాంతం. దశాబ్ధాలపాటు కమ్యూనిస్టు పార్టీ(Communists Party) లకు అండగా వున్న ఏరియా. తర్వాతి కాలంలో ఓ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్న నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. తాజా రాజకీయ పరిణామాలలో వామపక్షాల ఉనికి నామమాత్రం కాగా.. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎదిగిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది.

2019లో కాంగ్రెస్(Congress) అభ్యర్ధి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహారెడ్డి రెండోస్థానంలో నిలిచారు.

ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ(BJP) నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్(BRS) నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు.

publive-image

కాంగ్రెస్
కుందూరు రఘువీర్ రెడ్డి - జానారెడ్డి రాజకీయ వారసుడు. తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

బీజేపీ
శానంపూడి సైదిరెడ్డి - మాజీ ఎమ్మెల్యే. చాలా కాలం బీఆర్‌ఎస్‌లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు.

బీఆర్ఎస్
కంచర్ల కృష్ణారెడ్డి - బీఆర్‌ఎస్‌లో చాలాకాలంగా ఉన్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌ గెలిచే అవకాశం

publive-image

Also Read : Telangana Game Changer : సికింద్రాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

రీజన్స్‌:
1) నల్గొండలో కాంగ్రెస్‌ ట్రెడిషనల్‌ ఓటుబ్యాంకు ఎక్కువ. వామపక్షాలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించాయి.
2) జానారెడ్డి లెగసీ ప్లస్‌ పాయింట్‌. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్‌ బాధ్యత పెట్టడంతో వారు బాగానే కష్టపడుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌ సిట్టింగ్‌ సీటు కావడం ప్లస్‌ పాయింట్‌.
3) బీఆర్ఎస్‌ ఒక్క సూర్యాపేటలో ప్రభావం చూపినా, గెలవడానికి సరిపోదు.
4) ఇక్కడ బీజేపీ చాలా వీక్‌.. అది కాంగ్రెస్‌ అభ్యర్థికి ప్లస్‌ పాయింట్‌.
5) BJP సైదిరెడ్డి సొంతంగా కష్టపడుతున్నా గెలిచే అవకాశం కనిపించడం లేదు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు