Malkajgiri : మల్కాజ్‌గిరి.. 2009లో ఏర్పాటైన మల్కాజ్ గిరి లోక్‌సభ(Lok Sabha) నియోజకవర్గం దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న అతిపెద్ద నియోజకవర్గం. హైదరాబాద్ శివార్లలో విస్తరించి వున్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ(Telangana) స్థానికులతోపాటు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల వారూ వున్నారు. తమిళులు, రాజస్థానీల సంఖ్య కాస్త ఎక్కువగానే వుంటుంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఏరియాలో ఆంధ్రా సెటిలర్ల ప్రభావం ఎక్కువే. మిని ఇండియా(Mini India) గా మల్కాజ్‌గిరి సీటుకు పేరుంది.
2019లో కాంగ్రెస్ అభ్యర్ధి, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పట్నం సునీత, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్
పట్నం సునీత - రెండు సార్లు జడ్‌పీ చైర్మన్‌గా చేశారు. తొలిసారి ఎంపీగా బరిలో ఉన్నారు.
బీజేపీ
ఈటల రాజేందర్ - తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
బీఆర్ఎస్
రాగిడి లక్ష్మారెడ్డి - తొలిసారి ఎంపీ ఎన్నికల బరిలో ఉన్నారు.
బీజేపీ గెలిచే అవకాశం
Also Read : Telangana Game Changer: ఖమ్మంలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
రీజన్స్:
1) మోదీ చరిష్మా.. బీజేపీ గ్రాఫ్ చాలా బావుంది. ఈటల రాజేందర్ పట్ల సానుకూలత.. బీసీ ఓటు బ్యాంకు ప్లస్ పాయింట్
2) బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ప్రచారంలో కూడా దూకుడు లేదు. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి బాగా తిరుగుతున్నా.. చేవెళ్ళ నుంచి వచ్చారన్న కామెంట్లు మైనస్ అవుతున్నాయి.
3) మినీ ఇండియాగా పిలిచే మల్కాజ్‌గిరిలో తెలంగాణేతర వారు పెద్ద సంఖ్యలో బీజేపీ(BJP) పట్ల సానుకూలంగా వున్నారు. తమిళియన్స్, కేరలైట్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం.
4) బలహీనపడిన బీఆర్ఎస్ నేతలను, శ్రేణులను ఈటల ఓ వ్యూహం ప్రకారం అనుకూలంగా మలచుకుంటున్నారు.