Khammam : ఎన్నికలకు(Elections) కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో నగదు పంపిణీపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. దీంతో పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టలు(Currency Notes) బయటపడుతున్నాయి. తెలంగాణ(Telangana) లో హాట్ సీట్ గా మారిన ఖమ్మం పరిధిలో అభ్యర్థులు సైలెంట్ గా తరలిస్తున్న నగదు.. యాక్సిడెంట్ కారణంగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం క్రాస్ దగ్గర ఇన్నోవా కారు బోల్తా పడింది.
ఆ సమయంలో కారు వేగంగా ఉండడంతో పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఆ బ్యాగుల్లో మొత్తం రూ.2 కోట్లకు నగదు ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు, నగదును పరిశీలించి విచారణ చేపట్టారు. ఎన్నికల వేళ ఇంత డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరు తరలిస్తున్నారు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పంచేందుకే ఈ నగదును తరలిస్తున్నారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతోంది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. సొంతూళ్లకు పయనం