/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Peddireddy-jpg.webp)
BRS : పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. హుజూరాబాద్ కు చెందిన పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి(Peddi Reddy) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన బీజేపీ(BJP) లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందు ఆయన బీజేపీని వీడి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తనకు హుజూరాబాద్ టికెట్ ఇస్తానని చెబితినే పార్టీలో చేరానని ఆయన చెబుతున్నారు. కానీ అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి పార్టీని వీడడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు బీఆర్ఎస్‌లో సరైన గౌరవం దక్కలేదని పెద్దిరెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.