Telangana Lok Sabha Elections: దేశవ్యాప్తంగా మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల జోరు కొనసాగగా.. తాజాగా ఎంపీ ఎన్నికల్లోనూ (MP Elections) సర్వేలు రాజకీయాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే సర్వేను టైమ్స్ నౌ సంస్థ (Times Now Survey) విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ 9 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.
ALSO READ: ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక పోటీ?
ఇండియా టు డే సర్వేలో..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ (Congress) అదే ఉత్సాహాన్ని త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో గెలిచే గుర్రాలకే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఇండియా టుడే సంస్థ లోక్ సభ ఎన్నికలపై తెలంగాణలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మొత్తం 17 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 41.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమికి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
కారు, కమలానికి చేరి మూడు
తెలంగాణను పదేళ్లు పాలించిన గత టీఅర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి (BRS) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమైనా లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి.. అలాగే అన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగవేయాలని భావిస్తోన్న బీజేపీకి (BJP) ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ మూడు స్థానాల్లో, బీజేపీ కూడా మూడు స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. ఇక ఎంఐఎం ఒక స్థానానికే పరిమితం అవనున్నట్లు వెల్లడించింది.
ALSO READ: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
DO WATCH: