Vemula Veeresham: లక్షల ఎకరాలు కబ్జా.. జగదీష్ రెడ్డి వేముల వీరేశం సంచలన ఆరోపణలు

TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష 50 వేల ఎకరాల భూమి అక్రమించుకున్నారని ఆరోపించారు. తన దగ్గర అధరాలు ఉన్నాయని అన్నారు.

Vemula Veeresham: లక్షల ఎకరాలు కబ్జా.. జగదీష్ రెడ్డి వేముల వీరేశం సంచలన ఆరోపణలు
New Update

Vemula Veeresham: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష 50 వేల ఎకరాల భూమి ఆక్రమించారని సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లలో జగదీష్ రెడ్డి చేసిన అరాచకాలపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.దమ్ముంటే చర్చకు రావాలని జగదీష్‌రెడ్డికి వేముల వీరేశం సవాల్‌ విసిరారు.బీఆర్ఎస్ నేతల అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే, రాష్ట్రంలో కరవుకు కాంగ్రెస్సే కారణమని ఎలా అంటారు అని వేముల వీరేశం ప్రశ్నించారు.నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.నియంతృత్వ పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని తెలిపారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో విభేదాలు నెలకొనడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ చెప్పిన వేముల.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే వేముల వీరేశానికి కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేముల వీరేశం.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై ఘన విజయం సాధించారు.

#jagadish-reddy #lok-sabha-elections #vemula-veeresham
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe