Secunderabad MP Candidate: కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు?.. సీఎం రేవంత్ క్లారిటీ!

సికింద్రాబాద్ పార్లమెంట్‌ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు ఉండదని వారికి సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

New Update
Secunderabad MP Candidate: కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు?.. సీఎం రేవంత్ క్లారిటీ!

Congress Secunderabad MP Candidate: సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మార్పు జరుగుతున్న చర్చకు కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు (Danam Nagender) కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. పార్టీ మారిన దానం ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.

ALSO READ: ఢిల్లీలో బడే భాయ్.. గల్లీలో చోటే భాయ్.. కేటీఆర్ మాస్ వార్నింగ్

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ మారుస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. దానం నాగేందర్ కు కాకుండా మాజీ GHMC మేయర్ బొంతు రామ్మోహన్ కు (Bonthu Rammohan) సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్‌ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు ఉండదని వారికి సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ వస్తుందని ఆశగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆయనకు కాకుండా దానం నాగేందర్ కు కేటాయించింది. దీంతో నిరాశ చెందిన బొంతు రామ్మోహన్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పెద్దలకు దూరంగా ఉంటున్నారనే చర్చ నెలకొంది. తనకు ఎంపీ టికెట్ రాకపోవడంపై ఇప్పటి వరకు బొంతు రామ్మోహన్ స్పందించలేదు. తనకు హ్యాండ్ ఇచ్చిన హస్తంలో బొంతు రామ్మోహన్ కోనసాగుతారా? లేదా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు