RS Praveen Kumar: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?

కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, సీట్ల పంపకంపై ఇరు నేతలు చర్చించనున్నారు. అయితే పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

RS Praveen Kumar: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?
New Update

RS Praveen Kumar: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఎస్పీ (BSP) కేంద్ర సమన్వయకర్త, ఎంపీ రాంజీ గౌతమ్ కుమార్ ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పొత్తులపై వారు చర్చించనున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులపై కసరత్తు, సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతలు చర్చలు జరపనున్నారు. ఇటీవల తమ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు అంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. మాయావతి (Mayawati) అలా ట్వీట్ చేయడంతో తెలంగాణలో బీఎస్పీ బీఆర్ఎస్ నడుమ పొత్తు రద్దు అయిందంటూ వార్తలు వచ్చాయి.

ALSO READ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్.. క్లారిటీ!

బీఎస్పీ- బీఆర్ఎస్ పొత్తు ఉంది..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు (BRS - BSP Alliance) ఉంటుందని తేల్చి చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ ల మధ్య పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అనుమతి లభించిందని ఆయన వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇరు పార్టీలు కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. బీఎస్పీ-బీఆర్ఎస్ పార్టీల కూటమి చర్చలపై రాష్ట్రంలో ఏర్పడిన సందిగ్దానికి బెహన్జీ మాయావతి తెరదించారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎన్డీయే, ఇండియా కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి పార్టీ హైకమాండ్ అనుమతించిందని తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు.

నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటమి చెందారు. ఏకంగా మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీతో (BRS Party) పొత్తు పెట్టుకుంటే కనీసం పార్లమెంట్ ఇద్దరు ఎంపీలనైనా పంపవచ్చు అని భావిస్తున్నారట. ఈ క్రమంలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ గా పోటీ చేయాలనీ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పొత్తులో భాగంగా కేసీఆర్ కూడా నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#lok-sabha-elections-2024 #kcr #rs-praveen-kumar #brs-bsp-alliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి