Rahul Gandhi: నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికలు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. ఈరోజు ప్రియాంక గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు రాహుల్. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

New Update
Rahul Gandhi: మ్యూచువల్ ఫండ్స్ వదిలేసి స్టాక్స్ లో రాహుల్ గాంధీ పెట్టుబడులు.. ఏ కంపెనీల్లో పెట్టారంటే?

Rahul Gandhi: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి మరోసారి మూడు రంగుల జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా మరోసారి వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయనున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రియాంక గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. గత ఎంపీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేశారు రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్ లోని అమేథి, కేరళలోని వయనాడ్ లో ఎంపీగా పోటీ చేయగా.. అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో ప్రతిపక్ష గొంతు వినిపించారు.

ALSO READ: వెంటనే రుణమాఫీ చేయాలి.. సీఎం రేవంత్‌కు హరీష్ లేఖ

రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీకి బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ను బరిలోకి దింపింది. కామ్రేడ్లకు కంచుకోటగా ఉన్న కేరళ రాష్ట్రంలో సీపీఐ పార్టీ అన్నీ రాజాను బరిలోకి దింపింది. అయితే.. ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీని మరోసారి పార్లమెంట్ కు పంపుతారా లేదా బీజేపీ, సీపీఐ అభ్యర్థులను పంపుతారా? అనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

వయనాడ్ లో రాహుల్ కీలక వ్యాఖ్యలు..

ఈరోజు వయనాడ్ లో పర్యటించారు రాహుల్ గాంధీ. ఈ పర్యటనలో కిలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నా ఇల్లు అని.. వయనాడ్ ప్రజలు తన కుటుంబ సబ్యులని వ్యాఖ్యానించారు. నన్ను ఎంపీ గా గెలిపించిన వయనాడ్ ప్రజల నుంచి గత ఐదు ఏళ్లుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. వారి ప్రేమ, ఆప్యాయతలకు బందీని అయ్యానని పేర్కొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా వయనాడ్ నుంచి పోటీ చేస్తునందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఎన్నికలు భారతదేశ ఆత్మ కోసం పోరాటం అని.. ఇది భారత మాత గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్న ద్వేషం, అవినీతి, అన్యాయ శక్తుల నుండి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటం అని రాహుల్ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు