MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు అస్వస్థత

మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్‌లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు కేటీఆర్ హాజరు కాలేకపోతున్నట్లు తెలిపింది.

MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు అస్వస్థత
New Update

MLA KTR Suffering With Fever : వరుస పర్యటనలో సమావేశాలతో బిజీగా గడుపుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు (Karimnagar Meeting) కేటీఆర్ హాజరు కాలేకపోతున్నట్లు తెలిపింది. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపినట్లు వెల్లడించింది.

Also Read: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్

కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని తెలిపిన డాక్టర్లు.. కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన కేటీఆర్, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు తెలియజేశారు.

#kcr #mla-ktr #brs-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి