MLA KTR: ఢిల్లీలో బడే భాయ్.. గల్లీలో చోటే భాయ్.. కేటీఆర్ మాస్ వార్నింగ్

కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండు, చేనేత కార్మికుడు చితికిపోతుండని అన్నారు కేటీఆర్. ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు చేనేత రంగం కుదేలైంది.. గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందని విమర్శించారు.

KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్!
New Update

MLA KTR: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ (BRS) పాలనలో రైతు సంతోషంగా ఉన్నారని.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాగానే తెలంగాణలో కరువు వచ్చి.. పంటలు ఎండుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు గుప్పించారు కేటీఆర్.

కేటీఆర్ ట్విట్టర్ లో.. " కపట కాంగ్రెస్ పాలనలో.. కడుపునింపే అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతుండు... ప్రభుత్వ వైఫల్యం వల్ల.. పాలకుడి నిర్వాకం వల్ల.. ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డడు.. నాడు తెలంగాణ అవకాశాల గని చేనేత కార్మికుడికి చేతినిండా పని కానీ నేడు చేతకాని కాంగ్రెస్ పాలన.. కార్మికుల పాలిట శని, బతుకమ్మ చీరల ఆర్డర్లకు అడ్రస్ లేదు, ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం లేదు.

Also Read: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు

అసమర్థ పాలనలో దిక్కుతోచని నేతన్నకు.. చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండి లేదు బీఆర్ఎస్ తెచ్చిన.. సబ్సిడీ పథకాన్ని రాగానే సమాధి చేశారు. చేనేత మిత్ర పథకానికి నిలువునా పాతరేశారు. ఇలా ఇంకెంతకాలం అన్యాయాల జాతర చేస్తారు..? ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు ఈ రంగం కుదేలైంది, గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైంది. అందుకే.. మూలనపడ్డ మగ్గం సాక్షిగా హెచ్చరిక.. చేనేత కార్మికులను చిన్నచూపు చూస్తున్న.. భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు" అంటూ రాసుకొచ్చారు.

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ఫైర్..

బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ఫైర్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టో లో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13 వ పాయింట్ లో ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టే కి వెళితే వెంటనే అనర్హులు అయ్యే లా చట్ట సవరణ చేస్తాం అని చెబుతున్న కాంగ్రెస్.. తెలంగాణ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించిందని విమర్శించారు.

#brs #congress #lok-sabha-elections-2024 #mla-ktr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe