IFS Officers Transfers: తెలంగాణలో 8 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు.

Lok Sabha Elections: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సెలవులు!
New Update

IFS Officers Transfers: తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు.
* పైఫుల్లాను పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌గా నియామకం.
* ప్రియాంక వర్గీస్‌- సీసీఎఫ్‌ (ఐటీ)
* ఎస్టే ఆశా - ములుగు ఫారెస్ట్‌ కాలేజి డైరెక్టర్‌
* ప్రభాకర్‌- కాళేశ్వరం సర్కిల్‌ సీసీఎఫ్‌
* రవి కిరణ్‌ - మీ సేవా కమిషనర్‌
* ఆపర్ణ - డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌
* అంజు అగర్వాల్‌ - వరంగల్‌ డీఎఫ్‌వో

ALSO READ: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

ఇటీవల 8 మంది ఐఏఎస్ అధికారులు..

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు.

* సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ
* సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని (Mikkilineni Manu Choudary) నియమించింది.
* వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్‌ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది.
* అలాగే వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.
* ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు (అదనపు హోదాలో) చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్.

ALSO READ: కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్

#cm-revanth-reddy #ias-transfers #ifs-officers-transferred-in-telangana #telangana-ifs-officer-transfers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe