Dasoju Sravan: గద్దర్‌కు సీఎం రేవంత్ అన్యాయం.. దాసోజు శ్రవణ్ ఫైర్

కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్‌ను కాంగ్రెస్ గద్దర్ కూతురికి కాకుండా శ్రీగణేష్‌కు ఇవ్వడాన్ని తప్పుబట్టారు దాసోజు శ్రవణ్. 2023 ఎన్నికలలో పార్టీ గెలుపు కొరకు వెన్నెలను పోటీలో నిలబెట్టి, అధికారం చేజిక్కించుకున్నాక.. ఆమెకు టికెట్ ఇవ్వకపోవడం పచ్చి మోసం అని రేవంత్‌పై ఫైర్ అయ్యారు.

Dasoju Sravan: గద్దర్‌కు సీఎం రేవంత్ అన్యాయం.. దాసోజు శ్రవణ్ ఫైర్
New Update

Dasoju Sravan: కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గద్దర్ కూతురు వెన్నెలను (Gaddar Daughter Vennela) కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఆయన ట్విట్టర్ (X) వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీ ఎవరినయినా ఎన్నికల బరిలో నిలబెట్టే అధికారం ఉంటుందని.. కానీ 2023 ఎన్నికలలో పార్టీ గెలుపు కొరకు కీర్తిశేషులు గద్దరన్న (Gaddar) కూతురును పోటీలో నిలబెట్టి, అధికారం చేజిక్కించుకున్నంక.. ఇప్పుడు వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసం అని ఫైర్ అయ్యారు.

ALSO READ: సీబీఐ విచారణ.. కవితకు కొత్త టెన్షన్!

ఓడలో ఉన్నంత వరకు, ఓడ మల్లయ్య, ఒడ్డు చేరినంక బోడ మల్లయ్య అన్నట్లుంది రేవంత్ రెడ్డి వ్యవహారం అని చురకలు అంటించారు. వయోభారంతో అలసిపోయినప్పటికీ పట్టుదలతో కానీ కాంగ్రెస్ పార్టీ (Congress Party) గెలుపుకోసం కష్టకాలంలో పాదయాత్రలు చేసి, ఆడి, పాడి అసువులు బాసిన గౌరవ గద్దరన్నను, వారి కుటుంబాన్ని అవకాశవాదంతో విస్మరించి, అవమానించడం నేరం అని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. సినిమా అవార్డులతో సంతోషపెట్టి, అసలు రాజ్యాధికారం మాత్రం రాకుండా నయవంచన చేయడం న్యాయమా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా బీజేపీ నేత..

కాంగ్రెస్(Congress) సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును హైకమాండ్ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన లాస్య నందిత(Lasya Nanditha) ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికలతోనే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్, బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

#cm-revanth-reddy #dasoju-sravan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe