Erabelli Dayakar Rao: చిక్కుల్లో ఎర్రబెల్లి.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు! TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి చిక్కుల్లో పడ్డారు. తనను నిర్బంధించి ఇల్లు, రూ.50 లక్షలు ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నారంటూ బంజారాహిల్స్‌లోని శరణ్ చౌదరి అనే వ్యాపారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. By V.J Reddy 25 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Erabelli Dayakar Rao: బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తనను అక్రమంగా నిర్భంధించి అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేర ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారని, మరో 50 లక్షల నగదును తీసుకున్నారంటూ బంజారా హిల్స్ లో ఉండే వ్యాపారి శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు. 2023, ఆగస్ట్ 21న తాను ఆఫీస్ కు వెళ్తుండగా సివిల్ దుస్తుల్లో వచ్చి అడ్డుకున్న కొందరు తాము పోలీసులమని చెప్పి సీసీఎస్ కు తీసుకెళ్లారని అన్నారు. ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు తాను పలువురి నుంచి అక్రమంగా డిపాజిట్ లు సేకరించినట్టు కేసు పెట్టినట్టు బెదిరించినట్లు తెలిపారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డీసీపీ రాధా కిషన్ రావు సూచనల మేరకు తనను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బలవంతంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు విజయ్ పేరు మీద ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిపారు. రెండు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించి తన కుటుంబ సభ్యులను 50 లక్షలు ఇవ్వాలని బెదిరించి తన స్నేహితుడు 50 లక్షలు ఇచ్చిన తర్వాత వదిలి పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యగా ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు పోలీసులను తన వద్దకు పంపి బెదిరించి పిటిషన్ ను ఉపసంహరించుకునేలా చేశారు అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించి న్యాయం చెయ్యాలని సీఎంను కోరారు శరణ్ చౌదరి.. #cm-revanth-reddy #lok-sabha-elections #erabelli-dayakar-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి