CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్.. తుది జాబితా విడుదల

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ

CM Revanth Reddy To Delhi: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యహరిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్ని స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కేవలం 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ ఉన్నారు.

ALSO READ: సీఎం ఆఫీసులోకి వచ్చిన కంటైనర్.. ఏముందో చెప్పిన వైవీ సుబ్బారెడ్డి!

ఈరోజు తుది జాబితా?

తెలంగాణలో ఇప్పటికే రెండు జాబితాల్లో 9 ,పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్.. మిగతా 8 పార్లమెంట్ స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను (MP Candidates List) కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే సీపీఐ, సీపీఎం తో తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు వ్యారహారం కూడా కొలిక్కి రానుంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలకు కలిపి రెండు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు సీపీఐ, సీపీఎం నేతలు. మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అండగా ఉన్న కామ్రేడ్లకు కాంగ్రెస్ అభయం ఇస్తుందా? లేదా హ్యాండ్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి.

ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులు..

* సికింద్రాబాద్ – దానం నాగేందర్
* మల్కాజ్ గిరి – సునీత రెడ్డి
* చేవెళ్ల – రంజిత్ రెడ్డి
* పెద్దపల్లి- గడ్డం వంశీ
* ఆదిలాబాద్ – డా. సుమలత
* జహీరాబాద్- సురేష్ షెట్కర్
* నల్గొండ – జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి
* మహబూబాబాద్- బలరాం నాయక్
* మహబూబ్ నగర్ – వంశీచంద్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు