Lok Sabha Elections: కేసీఆర్‌కు షాక్.. బీజేపీలోకి ముగ్గురు నేతలు!

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీజేపీలోకి ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే చేరనున్నారు. ఈరోజు జాతీయ నేతల ఆధ్వర్యంలో మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, నగేష్‌,.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ హామీతోనే వారు బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది

New Update
Lok Sabha Elections: కేసీఆర్‌కు షాక్.. బీజేపీలోకి ముగ్గురు నేతలు!

Joinings In BJP: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Election) వేళ నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మెల్లిమెల్లిగా ఖాళీ అవుతోంది. తెలంగాణ(Telangana) లో బీజేపీ(BJP) ఆపరేషన్ ఆకర్ష్(Operation Akarsh) మొదలు పెట్టింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ(BJP).. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను తమ పార్టీలోకి లాగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చింది కాషాయం పార్టీ.

ALSO READ: భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేశారు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ లోకి బీఆర్ఎస్ నేతలు..

తెలంగాణ బీజేపీలోకి భారీగా చేరికలు నమోదు కానున్నాయి. కాసేపట్లో బీజేపీలో ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే చేరనున్నట్లు సమాచారం. బీజేపీలోకి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, నగేష్‌, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జాతీయ నేతల ఆధ్వర్యంలో పార్టీలో ముగ్గురు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. వీరి ముగ్గురికి రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఖమ్మం లోక్‌సభ సీటును జలగం వెంకట్రావు.. మహబూబాబాద్ లోక్ సభ అభ్యర్థిగా సీతారాం నాయక్‌.. అదిలాబాద్ లోక్ సభ స్థానం నగేష్ ఆశిస్తున్నారు. అయితే.. ఆదిలాబాద్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు కూడా ఈసారి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.

ఈ నెల 11న బీజేపీ రెండవ జాబితా..!

తొలి జాబితాలో తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. రెండవ జాబితాలో ఐదుగురిని బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు స్థానాలను మార్చి చివరి వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఈ నెల 11న రెండో జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సెకండ్ లిస్టులో వీరి పేరు?..

* మెదక్ – రఘునందన్ రావు.
* మహబూబ్ నగర్ – డీకే అరుణ
* ఆదిలాబాద్ – నగేష్
* మహబూబాబాద్ – మాజీ ఎంపీ సీతారాం
* ఖమ్మం – జలగం వెంకట్రావు

Advertisment
Advertisment
తాజా కథనాలు