Aroori Ramesh: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్.. క్లారిటీ!

తనను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అన్నారు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు.

Aroori Ramesh: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్.. క్లారిటీ!
New Update

Aroori Ramesh: కొన్ని రోజులుగా వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆయన నివాసిని వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన్ను కారులోకి ఎక్కించుకొని హైదరాబాద్ నందినగర్ లో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆరూరి రమేష్ వివరణ ఇచ్చారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అన్నారు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. తాను అమిత్ షా ను కలిశానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Also Read: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి?

ఎంపీ టికెట్ కోసమే..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నట్లు గత కొంత రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగింది. బీజేపీలో చేరేందుకు ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో ఆయన మంతనాలు కూడా చేసినట్లు తెలుస్తోంది.  మంగళవారం తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారని.. ఈ క్రమంలో ఈరోజు బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆరూరి రమేష్ కు బీజేపీ హైకమాండ్ వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఎంపీ టికెట్ కోసమే బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. తాజాగా ఈ ప్రచారానికి చెక్ పెట్టారు ఆరూరి రమేష్. తాను బీజేపీలో చేరడం లేదని అన్నారు. తాను కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతానని వెల్లడించారు. తాను అమిత్ షా ను కలవలేదని.. కేవలం తెలంగాణ బీజేపీ నాయకులతో భేటీ అయ్యానని తెలిపారు.

#kcr #aroori-ramesh #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe