BRS-BSP Alliance: ఎన్నికల షెడ్యూల్.. పొత్తు రద్దు

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించింది.

New Update
BRS-BSP Alliance: ఎన్నికల షెడ్యూల్.. పొత్తు రద్దు

BRS-BSP Alliance Cancelled: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బీఎస్పీ షాక్ ఇచ్చింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఇతర పార్టీలతో కూడా పొత్తు ఉండదని తేల్చి చెప్పింది.

ప్రవీణ్ రాజీనామా..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఇటీవల రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీ కి రెండు స్థానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్ రెండు ఎంపీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. తాజాగా బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు