BJP MP Fifth List: బీజేపీ ఐదో జాబితా విడుదల

నాలుగు జాబితాల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తాజాగా 107 మందితో ఐదో జాబితాను విడుదల చేసింది.ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. అలాగే తెలంగాణలో మిగిలి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.

BJP MP Fifth List: బీజేపీ ఐదో జాబితా విడుదల
New Update

BJP MP Fifth List: నాలుగు జాబితాల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తాజాగా 107 మందితో ఐదో జాబితాను విడుదల చేసింది.ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలంగాణలో 17 స్థానాలకు 15 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ అధిష్టానం .. తాజాగా మరో రెండు స్థానాలను ప్రకటించింది.

ALSO READ: 18 మందితో జనసేన అభ్యర్థుల ప్రకటన

ఏపీలో నుంచి ఎంపీ అభ్యర్థులు వీరే..

  • రాజమండ్రి - పురందేశ్వరి
  • తిరుపతి - వరప్రసాద్
  • అనకాపల్లి- సీఎం రమేష్
  • అరకు - కొత్తపల్లి గీత
  • రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి
  • నర్సాపురం - శ్రీనివాస్ వర్మ

తెలంగాణలో రెండు స్థానాల ప్రకటన..

తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో విజయమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం.. అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి వరకు తెలంగాణలో 15 మంది ఎంపీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను హోల్డ్ లో పెట్టిన బీజేపీ.. తాజాగా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేర్లను ప్రకటించింది.

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు.. 

1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్

2. బండి సంజయ్ – కరీంనగర్

3. ధర్మపురి అర్వింద్ – నిజామాబాద్

4. బీబీ పాటిల్ – జహీరాబాద్

5. పోతుగంటి భరత్ – నాగర్ కర్నూల్

6. బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి

7. కొండ విశ్వేశ్వర రెడ్డి – చేవెళ్ల

8. మాధవీలత – హైదరాబాద్

9. ఈటల రాజేందర్ – మల్కాజ్‌గిరి

10. పెద్దపల్లి - గోమస శ్రీనివాస్

11. మహబూబ్ నగర్ - డీకే అరుణ

12. నల్గొండ - సైది రెడ్డి

13. మహబూబాబాద్ - సీతారాం నాయక్

14. ఆదిలాబాద్ - నగేష్

15. మెదక్ - రఘునందన్ రావు

16. వరంగల్ - ఆరూరి రమేష్

17. ఖమ్మం - తాండ్ర వినోద్ రావు

#bjp #bjp-ap-mp-candidates #lok-sabha-elections #bjp-mp-fifth-list
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe