BJP Second List: మార్చి 11న బీజేపీ రెండో జాబితా?

195 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ.. రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఈ నెల 11న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజు అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించాలని భావిస్తోంది. తెలంగాణ నుంచి ఐదుగురిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్

BJP Second List: దేశంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన బీజేపీ తమకు రానున్న లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు పక్కాగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 10న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 10న జరగబోయే ఎన్నికల కమిటీ భేటీలో రెండో జాబితా అభ్యర్థులపై చర్చించనున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ఈ నెల 13 కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకటన తరువాత పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.

ALSO READ: మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ నుంచి ఐదుగురు..!

తొలి జాబితాలో తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. రెండవ జాబితాలో ఐదుగురిని బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు స్థానాలను మార్చి చివరి వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఈ నెల 11న రెండో జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సెకండ్ లిస్టులో వీరి పేరు?..

* మెదక్ - రఘునందన్ రావు.
* మహబూబ్ నగర్ - డీకే అరుణ
* ఆదిలాబాద్ - సోయం బాపూరావు
* మహబూబాబాద్ - మాజీ ఎంపీ సీతారాం
* ఖమ్మం - జలగం వెంకట్రావు

ALSO READ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన?

మొదటి లిస్టులో..

1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్
2. బండి సంజయ్ – కరీంనగర్
3. ధర్మపురి అర్వింద్ – నిజామాబాద్
4. బీబీ పాటిల్ – జహీరాబాద్
5. పోతుగంటి భరత్ – నాగర్ కర్నూల్
6. బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి
7. కొండ విశ్వేశ్వర రెడ్డి – చేవెళ్ల
8. మాధవీలత – హైదరాబాద్
9. ఈటల రాజేందర్ – మల్కాజ్‌గిరి

Advertisment
Advertisment
తాజా కథనాలు