Elections 2024: ష్.. గప్ చుప్.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ.. తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో గత రెండు నెలలుగా రాజకీయ నాయకుల సందడితో రెండు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొనగా ఈ రోజు రాత్రినుంచి అంతా సైలెంట్ కానుంది.

Elections 2024: ష్.. గప్ చుప్.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం!
New Update

Lok Sabha Elections Campaigning Comes to End: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో (AP) లోక్ సభ, అసెంబ్లీ.. తెలంగాణలో (Telangana) లోక్‌ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో గత రెండు నెలలుగా రాజకీయ నాయకుల సందడితో రెండు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొనగా ఈ రోజు రాత్రినుంచి అంతా సెలెంట్ కానుంది. పార్టీలన్నీ ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకోగా బస్సు యాత్రలు, బహిరంగ సభలతో హోరెత్తించాయి. ఇక మే 13న సోమవారం పోలింగ్‌ జరుగనుండడంతో నేడు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా (Mukesh Kumar Meena), తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) తెలిపారు.

48 గంటల సైలెన్స్ పీరియడ్..

ఈ మేరకు ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..  మే 13 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరగనుందని చెప్పారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ పోలింగ్ జరగనుండగా.. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ రోజు సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటినుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలని సూచించారు. ఇక రేపు ఉదయం నుంచి సాయంత్రం లోగా EVM మెషిన్ లు పోలింగ్ కేంద్రాలకు చేరుతాయి. ఉదయం 7 లోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి పోలింగ్ ప్రారంభిస్తాం. పోలింగ్ స్టేషన్ లో ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండాలి. పోలింగ్ స్టేషన్ కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకూడదని సూచించారు. పార్టీల రాష్ట్ర ఇన్‌ఛార్జులు, ఆఫీసు బేరర్లు పార్టీ కార్యాలయాలకే పరిమితం కావాలని తెలిపారు.

అన్ని జిల్లాల్లో 144 సెక్షన్‌..

ఇక మే 13న ఎన్నికలు ముగిసే వరకు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ, పోలీస్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్‌లు తనిఖీ చేయనున్నారు. రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. సైలెన్స్‌ పీరియడ్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి రాజకీయపరమైన సమావేశాలు, మెసెజ్ ల పంపకాలను ఎన్నికల సంఘం నిషేధించింది.

ఇది కూడా చదవండి: Hyderabad: బీజేపీ ఎంపీ నవనీత్‌ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు!

ఈ మేరకు ఏపీ, తెలంగాణలో లో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యాయి. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రమంతటా హోరెత్తించారు. మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ రోజే ప్రచారానికి చివరిరోజు కాగా.. రేపటినుంచి పల్లెలు, పట్నాల్లో మైకులన్నీ మూగబోనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, వైసీపీ, టీడీపీ కూటమి అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగుల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ తరఫున తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌ షోల్లో పాల్గొన్నారు. జాతీయ నాయకులు మోడీ, రాహుల్, అమిత్‌ వంటి వారు తెలుగురాష్ట్రాల్లో సంచరిస్తూ పార్టీ గెలుపుకోసం కీలక హామీలు ఇచ్చారు.

#telugu-states #lok-sabha-election-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe