Lord Hanuman: ఆ ఊరిలో హనుమంతుని పేరు వినిపిస్తే ఇక అంతే సంగతులు!

రామ భక్తుడు హనుమంతుని పేరు వినిపిస్తే చాలు ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఈ ప్రాంతం ఎక్కడో లేదు. భారత్‌ లోని ఉత్తరాఖండ్‌ లో ఉంది. మరీ ఆ ఊరి ప్రజలు ఎందుకు హనుమంతున్ని పూజించరో దానికి గల కారణాలు, పురాణా కథను ఈ స్టోరీలో చదివేయండి.

New Update
Lord Hanuman:  ఆ ఊరిలో హనుమంతుని పేరు వినిపిస్తే ఇక అంతే సంగతులు!

Lord Hanuman: యావత్‌ ప్రపంచంలోని హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహోన్నత కార్యక్రమం అయినటువంటి అయోధ్య (Ayodhya)  రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరి కొన్ని గంటల్లో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా వేచి చూస్తున్నారు.

రాముల వారు అంటే ఆయన వెంటనే గుర్తుకు వచ్చే పేరు హనుమంతుల (Hanuman) వారు. రామునికి హనుమంతుని కంటే గొప్ప భక్తులు ఎవరూ లేరని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రస్తుతం ప్రతి పల్లెటూరులోనూ కచ్చితంగా ఆంజనేయుని గుడి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో కూడా కచ్చితంగా హనుమంతుని విగ్రహాం కూడా ఉంటుంది.

మొత్తం హిందువులే అయినప్పటికీ..

కానీ ఈ ఊర్లో మాత్రం ఉన్నది మొత్తం హిందువులే అయినప్పటికీ హనుమంతుని పేరు ఎత్తితే మాత్రం ఆ ఊరి నుంచే వెలివేస్తారు. ఇది ఎక్కడో ప్రపంచంలో ఓ మూలన ఉంది అనుకుంటే పొరపాటే..సాక్షత్తు భారతదేశంలోని ఉత్తరాఖండ్‌ లో ఉంది. అసలు ఆంజనేయుని పేరు వినిపిస్తే ఎందుకు ఆ ఊరు నుంచి వెలివేస్తారు. వారందరికీ ఆ రామ భక్తుడు అంటే ఎందుకు అంత కోపం అనే విషయాలను తెలుసుకుందాం..!

ఉత్తరాఖండ్‌ లోని చమోలి జిల్లాలోని ద్రోణగిరి  (Dronagiri) పర్వతం కింద ఉన్న ద్రోణగిరి గ్రామంలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో తక్కువ నివాసితులు ఉండవచ్చు కానీ గ్రామం, పర్వతం చుట్టూ ఔషధ మొక్కలకు కొరత లేదు. ఈ ప్రాంతం స్థానిక ఔషధ వృక్ష జాతులతో సమృద్ధిగా ఉంది. ద్రోణగిరి గ్రామం ట్రెక్కింగ్ (Trekking) చేసేవారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం.

ఈ గ్రామ నివాసులు హనుమంతుని పూజించరని చెబుతారు. వారు దానికి కారణం ఉన్నట్లు కూడా చెబుతారు. స్థానిక నివాసితులకు, ద్రోణగిరి పర్వతం మొత్తం దైవంతో సమానం. వారంతా కూడా దానిని పూజిస్తారు. రామాయణం ప్రకారం, సీతను రావణుడు అపహరించిన తరువాత, రావణుని దళాలు, రామ - లక్ష్మణుల మధ్య భారీ యుద్ధం జరిగింది.

యుద్ధంలో, మేఘనాధుడు, రావణుని కుమారుడు లక్ష్మణుడిని తీవ్రంగా గాయపరిచాడు, ఆ తర్వాత లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు హనుమంతుడు ప్రాణాలను రక్షించే సంజీవని (Sanjeevani) మొక్కను కనుగొనడానికి బయలుదేరాడు . ఈ ఔషధ మూలిక ద్రోణగిరి పర్వతం పైన మాత్రమే పెరిగింది. కానీ హనుమంతుడు పర్వతాన్ని చేరుకున్నప్పుడు మొక్కను గుర్తించలేకపోయాడు.

హనుమంతుడు పగలగొట్టడంతో..

చివరికి అతను పర్వత శిఖరాన్ని మొత్తాన్ని తీసుకుని లక్ష్మణుడు ఉన్న చోటికి తీసుకువెళ్లాడు. దీని వల్ల ద్రోణగిరి పర్వతంలోని కొంత భాగం విరిగిపోయిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. తమ ఆరాధ్య దైవంలోని భాగాన్ని హనుమంతుడు పగలగొట్టడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికులు చాలా మంది హనుమంతుడిని పూజించకపోవడానికి కారణం ఇదే. కొన్నేళ్ల క్రితం వరకు, ఎవరైనా హనుమంతుడిని పూజిస్తున్నట్లు గ్రామస్తులకు తెలిస్తే, వారు వెంటనే ఆ వ్యక్తిని, కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించేవారు. ఇప్పటికీ అక్కడ ఇదే ఆచారం కొనసాగుతుందని తెలుస్తుంది.

పొరపాటున కూడా ఆ ఊరిలో ఆంజనేయుని పేరు వినిపిస్తే చాలు..ఇక అంతే సంగతులు! మరి మీరు ఎప్పుడైనా ఆ ఊరు వెళ్తే జాగ్రత్త మరి.

Also read: చలికాలంలో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది..దాని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!

Advertisment
తాజా కథనాలు