Big Breaking: పోలీసుల అదుపులో లోకల్‌ బాయ్ నాని.. ఘటనపై ఆరా..

విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌లో నిన్న రాత్రి అగ్నిప్రమాదానికి ముందు జరిగిన ఓ పార్టీలో గొడవ జరిగిందని.. ఆ గొడవలో యూట్యూబర్ లోకల్‌ బాయ్ నాని ఉన్నాడని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. తాజాగా పోలీసులు లోకల్‌ బాయ్ నాని, అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Big Breaking: పోలీసుల అదుపులో లోకల్‌ బాయ్ నాని.. ఘటనపై ఆరా..
New Update

విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో దాదాపు 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అయితే నిన్న రాత్రి అక్కడ పార్టీ జరగగా గొడవ జరిగిందని.. ఆ గొడవలో యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని కూడా ఉన్నారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే తాజాగా పోలీసులు లోకల్‌ బాయ్‌నాని, అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. 'లోకల్‌ బాయ్‌ నాని ఓ బోటును అమ్మకానికి పెట్టాడు. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా కొంత సొమ్మును కూడా చెల్లించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత బాలాజి తన అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాలని అడిగాడు. అయితే ఇదే క్రమంలో నిన్న రాత్రి గొడవ జరిగిందని.. మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని' పలువురు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఆ బోటులో ఏం జరిగింది.. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు దర్యాప్తు జరిగన తర్వాత పోలీసులు పూర్తి విషయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని.. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండి వారికి సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఈ ప్రమాదం వల్ల దాదాపు 40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగందని మత్స్యకారులు వాపోతున్నారు.

ఇంతకీ ఈ లోకల్‌ బాయ్‌ నాని ఎవరంటే ఇతను రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంటాడు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. వివిధ రకాల చేపలను పట్టుకుని వాటిని వండుకొని తెనే వీడియోలను నెటీనజ్లకు చూపిస్తుంటాడు. ఈ విడియోలలో నాని టీమ్‌ మెంబర్స్‌తో పాటు అతని భార్య కూడా కనిపిస్తుంటుంది.  ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే.. బోట్లు తగలబడిపోతున్న వీడియోను తన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

#local-boy-nani #telugu-news #vishaka-harbour
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి