Ayodhya Ram Mandir: అద్వానీ, జోషి..మీరిద్దరు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావొద్దు!

బీజేపీ కురవృద్ధులైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలకు జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. పైగా వారిద్దరినీ కార్యక్రమానికి రావొద్దని ఆలయ ట్రస్ట్‌ వారికి తెలిపినట్లు సమాచారం.

New Update
Ayodhya Ram Mandir: అద్వానీ, జోషి..మీరిద్దరు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావొద్దు!

అయోధ్యలో రామమందిరం కట్టాలని కలలు కన్న ఎల్‌కే అద్వానీకి అవమానం ఎదురైంది. ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్న సమయంలో ఆయన రాజకీయ యాత్ర చేపట్టిన ప్రతి చోటు నుంచి అయోధ్య రామ మందిరం నిర్మించడం కోసమని ఇటుకలు సేకరించిన అద్వానీని అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావొద్దని ఆలయ ట్రస్టు పేర్కొంది.

బీజేపీలోనే అత్యంత సీనియర్ మోస్ట్‌ నాయకులైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలు ఇద్దరు కూడా కొన్ని దశాబ్దాల నుంచి పార్టీని అట్టిపెట్టుకునే ఉన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మించడం కోసం వీరిద్దరూ జైలు జీవితం కూడా అనుభవించారు. వారి కష్టానికి తగ్గ ఫలితంగా వారు ఉండగానే రామ మందిరం నిర్మించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కొద్ది రోజుల్లోనే దాని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరుగుతోంది.

కానీ ఇలాంటి సమయంలో వారిద్దరని రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావొద్దని శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వారిని కోరింది. అసలు వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వకపోగా..రావొద్దని చెప్పడం ఇప్పుడు చర్చానీయాంశం అయ్యింది. అయితే ఇలా చేయడానికి గల కారణాలను కూడా ట్రస్ట్‌ సభ్యులు వివరించారు.

పార్టీలో అత్యంత కురువృద్దులైన అద్వానీ, జోషిల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వారిద్దరినీ జనవరి 22న ఆలయానికి రావొద్దని తెలిపినట్లు వారు వివరించారు. ఎందుకంటే ప్రస్తుతం అద్వానీ వయసు 96 సంవత్సరాలు...జోషి వయసు 89 సంవత్సరాలు . ఇలాంటి సమయంలో వారు కార్యక్రమానికి వస్తే కనుక చాలా ఇబ్బందులు పడతారని వారిని కార్యక్రమానికి హాజరు కావొద్దని తెలిపినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వివరించారు.

ట్రస్ట్‌ చేసిన విన్నపాన్ని వారిద్దరూ కూడా అంగీకరించినట్లు చంపత్‌ రాయ్‌ వివరించారు. ఇదిలా ఉంటే 90 సంవత్సరాల దేవెగౌడను కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆయన వద్దకు ఆలయ కమిటీ సభ్యులు ముగ్గురు వెళ్లినట్లు సమాచారం. ఆయనను పిలిచి రామాలయం నిర్మాణానికి మూల స్తంభాలు అయినటువంటి వారిని ఆహ్వానించకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కేవలం వారిని అవమానించడానికే వారిని ఆహ్వానించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also read: సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు..టెన్షన్‌ లో ఎమ్మెల్యేలు!

Advertisment
తాజా కథనాలు