GojiBerry Fruit: ఇవి తింటే మీ లివర్ మొత్తం శుభ్రం..మళ్లీ కొత్తగా మారుతుంది

కాలేయ సమస్యతో బాధపడుతుంటే గోజీ బెర్రీ పండు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలం ఉన్నాయి. ఈ బెర్రీని తింటే అనేక వ్యాధులను నయం చేస్తుంది. గోజీ బెర్రీలను స్నాక్స్, స్మూతీస్, ఇతర విత్తనాలతో కలిపి తింటే మంచిది.

New Update
GojiBerry Fruit: ఇవి తింటే మీ లివర్ మొత్తం శుభ్రం..మళ్లీ కొత్తగా మారుతుంది

Goji Berry Fruit : ప్రస్తుత కాలంలో కొవ్వు కాలేయ వ్యాధితో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే తక్కువ ఆకలి, ఉబ్బరం, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే.. ఇవి కొవ్వు కాలేయ వ్యాధికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. కొవ్వు కాలేయ వ్యాధిలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది కాలేయ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. కాలేయ కొవ్వును తగ్గించడానికి, దానిని బలోపేతం చేయడానికి, కొత్తగా, బలంగా ఉండాలంటే కింద కొన్ని పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.

గోజీ బెర్రీ పండు వల్ల ప్రయోజనాలు:

  • గోజీ బెర్రీ(Goji Berry) ని వోల్ఫ్‌బెర్రీ(Volfo Berry) అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత పోషకమైన బెర్రీలలో ఒకటి. కొవ్వు(Cholesterol) కాలేయ వ్యాధి(Liver Disease) ని సహజంగా రివర్స్ చేయగల శక్తివంతమైన పండు.
  • వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలం ఉన్నాయి. ఈ బెర్రీని తింటే అనేక వ్యాధులను నయం చేస్తుంది.
  • గోజీ బెర్రీలలో వివిధ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. దీర్ఘకాలిక ఆక్సీకరణ ఒత్తిడి కొవ్వు కాలేయ వ్యాధితో సంబంధం కలిగి ఉంటుంది.
  • గోజీ బెర్రీలను స్నాక్స్, స్మూతీస్, ఇతర విత్తనాలతో కలిపి, టీ, సలాడ్ రూపంలో తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
  • కాలేయ వ్యాధి పురోగతిలో దీర్ఘకాలిక మంట అనేది అంశం. గోజీ బెర్రీలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది వాపును తగ్గించడం కాలేయ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
  • కొన్ని అధ్యయనాల ప్రకారం.. గోజీ బెర్రీ జ్యూస్(Goji Berry Juice) తాగడం వల్ల కాలేయాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. గోజీ బెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కాలేయాన్ని రక్షిస్తాయి.

ఇది కూడా చదవండి: ఈ చేపలను తింటే కడుపు మొత్తం క్లీన్ అవుతుంది..తప్పక తినండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే జామకాయ రసం తాగితే ఏమవుతుంది?

Advertisment
తాజా కథనాలు