Hathras Stampede: ‘నరబలి ఇస్తే నిధులు దొరుకుతాయన్న ఆశ.. ఓ స్త్రీ రేపు రా అని తలుపు మీద రాయకపోతే దయ్యం వస్తుందన్న భయం.. మంచి జరుగుతుందన్న ఆశ.. చెడు జరుగుతుందన్న భయం మనిషిని దెన్నైనా గుడ్డిగా నమ్మాలే చేస్తాయి.. వీళ్లు వ్యాపారం చేసింది మనుషులతో కాదు.. వాళ్ల నమ్మకాలతో..’ 2019లో రిలీజైన టాలీవుడ్ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో హీరో చెప్పే డైలాగ్ ఇది.. హత్రాస్ తొక్కిసలాటలో చనిపోయిన మృతుల సంఖ్య అంతకంతకూ పెరగడం చూస్తే ఈ డైలాగ్ నిజమేనని అంగీకరించక తప్పదు. బాబా పాద ధూళి కోసం ఎగబడ్డ భక్తులు చివరికి ఆ మట్టిలోనే కలిసిపోవడం విషాదం.. అయితే మతపరమైన ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు.. గతంలోనూ అనేకసార్లు అమాయక భక్తులు ఇలానే ప్రాణాలు వదిలారు..!
Hathras Stampede: గతంలో కూడా హత్రాస్ లాంటి అనేక విషాదాలు.. వందలాదిగా మరణాలు.. లిస్ట్ ఇదే!
హత్రాస్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. బాబా పాద ధూళి కోసం భక్తులు ఒకేసారి ఎగబడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మన దేశంలో మతపరమైన ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు అనేక సార్లు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఘటనల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: