Liquor Lorry Video: ఏపీలో మద్యం లారీ బోల్తా.. మందుబాబులకు జాతరే జాతర..!

విశాఖ మధురవాడ కొమ్మది వద్ద మద్యం లారీ బోల్తా పడింది. ఆ లిక్కర్‌ బాటిల్స్‌ను తీసుకెళ్లడానికి అక్కడే ఉన్న స్థానికులు ఎగబడ్డారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

New Update
Liquor Lorry Video: ఏపీలో మద్యం లారీ బోల్తా.. మందుబాబులకు జాతరే జాతర..!

బాడీ ఎక్కడున్నా మందుబాబుల మనసు మాత్రం ఎప్పుడూ క్వార్టర్‌పైనే ఉంటుంది. ఆఫీస్‌లో పని చేస్తుంటారు కానీ.. అక్కడ కూడా నైట్‌ ఏం తాగుదామా అని థింక్‌ చేస్తుంటారు. కొంతమందికి డబ్బులు లేకున్నా.. అప్పు చేసి మరి తాగుతారు. దీన్నే వ్యసనం లేదా మద్యానికి బానిసత్వం అంటారు. ఎన్ని మాటలన్నా.. ఎన్ని చెప్పినా వారి బుద్ధి మారదు. ధరలు పెరిగితే పక్కనొడిని గిల్లైనా మందు బాటిల్‌ కొనుక్కొనే వారు ఉన్న ఈ రోజుల్లో.. ఫ్రీగా ఎవరైనా మందు పోస్తా అంటే సిట్టింగ్‌కు వెళ్లకుండా ఉంటారా? పోని ఫ్రీగా లిక్కర్‌ ఇస్తున్నారంటే రయ్‌ రయ్‌మని ఆ ప్రాంతానికి దూసుకెళ్లకుండా ఉంటారా? ఒకవేళ వెళ్లలేదంటే వాడు తాగుబోతై ఉండడు. రియల్ తాగుబోతులకు మద్యం పిచ్చి ఉంటుంది. విశాఖలో జరిగిన ఈ ఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది

దూసుకొచ్చారు.. పట్టుకుపోయారు:
విశాఖ(Visakhapatnam)లోని మధురవాడ(Madhurawada) ప్రాంతం.. అప్పటికీ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది. కొందరు ఆఫీస్‌లకు వెళ్తున్నారు.. మరికొందరు దీపావళి కావడంతో బాంబులు కొనుగోలు చేయడానికి వెళ్తున్నారు. ఇంకొందరు ఇతర పనులపై వెళ్తున్నారు. రోడ్డు మధ్యలో నుంచి ఓ లారీ వెళ్తుంది. అప్పటివరకు స్టడీగానే వెళ్లింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి బోల్తా పడింది. వెంటనే రోడ్డుపై ఉన్నవాళ్లు షాక్‌ అయ్యారు. ఎవరికైనా ఏమైనా జరిగిందేమోనని భయపడ్డారు. కానీ ఎవరికి ఏం కాకపోవడంతో ముందుగా ఊపిరిపీల్చుకున్నారు.. ఆ వెంటనే ముక్కుతో వాసన పీల్చారు.. అదే మందువాసన..! మద్యం(Liquor) అలవాటు లేని వారు ముక్కు ముసుకోని అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. లిక్కర్‌ లవర్స్‌ మాత్రం పరుగుపరుగునా లారీ వద్దకు దూసుకొచ్చారు. అక్కడ స్పీడో మీటర్‌ లేదు కానీ.. ఆ రన్నింగ్‌ స్పీడ్‌ ఉసెన్‌ బోల్ట్‌తో పాటు వికెట్ల మధ్య ధోనీ రన్నింగ్‌ స్పీడ్‌ కంటే ఎక్కువగా ఉంటుందన్నది స్థానికుల మాట.

జేబులో బాటిల్స్‌.. వెంటనే జేసీబీ ఎంట్రీ:
అప్పటికి మద్యం రోడ్డుపై పారుతోంది. అలా మద్యం రోడ్డుపాలు కావడాన్ని మద్యం లవర్స్‌ జీర్ణించుకోలేకపోయారు. ఇంత మద్యం వేస్ట్ అవుతుందా దేవుడా అంటూ ఆకాశం వైపు చూశారు. అలా పైకి చూస్తూనే కిందకు వంగి దొరికిన బాటిళ్లు తీసుకొని పరిగెత్తారు. ఇంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికీ ట్రాఫిక్‌ జామ్ ఉంది. లారీ బోల్తా పడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. మందుబాబులను సైడ్ చేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు పోలీసులు. జేసీబీ సాయంతో లారీని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు.

Also Read: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు