Lipstick: పెదాలపై లిప్‌స్టిక్‌ ఎక్కువ సేపు ఉంటే ప్రమాదకరమా?

రోజూ పెదవులపై లిప్‌స్టిక్‌ను పూయడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో ప్రమాదకరం. ముందుగా పెదాలపై లిప్‌బామ్‌ రాసుకుంటే లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదవుల్లోకి చేరకుండా చేస్తుంది. ఈవెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే మేకప్ రిమూవర్‌తో లిప్‌స్టిక్‌ను తీసివేయాని నిపుణులు చెబుతున్నారు.

Lipstick: పెదాలపై లిప్‌స్టిక్‌ ఎక్కువ సేపు ఉంటే ప్రమాదకరమా?
New Update

Lipstick: అమ్మాయిలు అందంగా ఉంటేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రతిరోజూ రెడీ అయ్యే వాటిల్లో లిప్‌స్టిక్‌ని ముఖ్యంగా వాడిస్తుంటారు. దీన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రమాదకరంతోపాటు అనేక నష్టాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందంగా కనిపించడం అందరికీ ఇష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు కొన్ని వస్తువులను ఉపయోగించడం వలన వారి ముఖాలను మరింత అందంగా మారుతాయి. కొంతమంది అమ్మాయిలకు లిప్‌స్టిక్ వేసుకోవడం అలవాటు ఉంటుంది. అయితే రోజూ పెదవులపై లిప్‌స్టిక్‌ను పూయడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ఎంత ప్రమాదకరంగా ఉంటుందని కొందరీకి తెలియందు. లిప్‌స్టిక్‌ ఎక్కువగా వాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

publive-image

లిప్‌స్టిక్‌ ఎక్కువ సేపు ఉంటే కలిగే ఇబ్బందులు:

  • అమ్మాయిలు లిప్‌స్టిక్‌తో మరింత అందంగా కనిపిస్తారు. కానీ ప్రతిరోజూ లిప్‌స్టిక్‌ను అప్లై చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం. లిప్‌స్టిక్‌లో అనేక రకాల రసాయనాలు పెదాలకు హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెదవుల చర్మం బయటకు వస్తుంది.
  • రోజూ లిప్‌స్టిక్‌ను అప్లై చేస్తే అందులో ఉండే తల్లులు పెదాలను పొడిబారటంతోపాటు పెదాలు నల్లబడటానికి కారణమవుతాయి. అంతే కాకుండా పదే పదే లిప్‌స్టిక్ వాడటం వల్ల పెదవుల రేఖలు లోతుగా మారడంతోపాటు అలర్జీ వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
  • ఏదైనా ఈవెంట్‌కి వెళ్లి లిప్‌స్టిక్‌ వేసుకోవాలనుకుంటే ముందుగా పెదాలపై లిప్‌బామ్‌ రాసుకుంటే లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదవుల్లోకి చేరకుండా చేస్తుంది. ఈవెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, వెంటనే మేకప్ రిమూవర్‌తో లిప్‌స్టిక్‌ను తీసివేయాని నిపుణులు చెబుతున్నారు.
  • పెదవులపై ఎక్కువ సేపు లిప్ స్టిక్ వేసుకోవడం సరికాదు. కొబ్బరినూనె, తేనె లేదా అలోవెరా జెల్‌ని రోజూ పెదవులపై రాసుకుంటే పెదాలు మృదువుగా ఉంటాయి. లిప్‌స్టిక్‌ను అప్లై చేసిన తర్వాత పెదవులపై చికాకు, అలెర్జీ వంటి సమస్యలు ఉంటే.. ఖచ్చితంగా చర్మ డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

publive-image

ఇది కూడా చదవండి: ఈ ఒక్క అలవాటుతో మీ అధిక రక్తపోటు ప్రమాదాన్ని 40శాతం తగ్గుతుంది!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#best-health-tips #lipstick #dangerous #long-time
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe