Free Current: ఫ్రీ కరెంట్ కావాలంటే ఇది తప్పనిసరి?

మరో రెండు గ్యారెంటీలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలంటే ఫోన్ నెంబర్‌ను విద్యుత్ ఆఫీసులో ఇవ్వాలని విద్యుత్ వినియోగదారులను ప్రభుత్వం కోరింది. మీ నెంబర్‌ను విద్యుత్ ఆఫీసులో లింక్ చేయడం వల్ల మీ ఫోన్ కే బిల్లులు రానున్నాయి.

Free Current: ఫ్రీ కరెంట్ కావాలంటే ఇది తప్పనిసరి?
New Update

Free Current Scheme: తెలంగాణలో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణ చేపట్టింది.

ALSO READ: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు?

ఫోన్ నెంబర్ లింక్?

ఇదిలా ఉండగా గృహ జ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ను ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫ్రీ కరెంట్ కొరకు తెలంగాణ సర్కారు కొత్త నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. నెలకు 200 యూనిట్ల కరెంట్ కావాలంటే మీ ఫోన్ నంబరు విద్యుత్ ఆఫీసులో ఇవ్వాలని విద్యుత్ వినియోగదారులను కోరింది ప్రభుత్వం. మీ ఫోన్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ పథకానికి అనర్హులు అయ్యే అవకాశం ఉందని.. విద్యుత్ వినియోగదారులను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. సదరు నంబరుకు ప్రతినెలా కరెంటు బిల్లు పంపనున్నారు.. కొందరి నంబర్లు లేకపోవడంతో సందేశాలు వెళ్లడంలేదని డిస్కమ్‌ లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాయి. ఆన్‌ లైన్ లో కూడా ఫోన్ నంబరును అప్‌డేట్ చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది. ఇందుకోసం TSSPDCL యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..

రేపు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం (Telangana Cabinet Meet) సమావేశం కానుంది. ఆరు గ్యారంటీల (6 Guarantees) అమలు చేయడంపై రాష్ట్ర కేబినెట్‌ చర్చించనుంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు (Free Current) పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలోనూ.. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) ప్రకటించిన విషయం తెలిసిందే.

DO WATCH: 

#cm-revanth-reddy #mahalakshmi-scheme #telangana-latest-news #200-units-free-current #congess-six-guarantess
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe