Rain alert: వాతావరణ శాఖ అలర్ట్‌ ..రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలే వానలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు తీరానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి ఉపరితల అవర్తనం కొనసాగుతోందని అధికారులు వివరించారు.

New Update
Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD)అధికారులు తెలిపారు. సముద్రంలో ఏర్పడిన ద్రోణి శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని అధికారులు వివరించారు. తమిళనాడు తీరానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తనం కొనసాగుతోంది.

సోమవారం నాడు ఉత్తర కోస్తా, యానాంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని లేకపోతే ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అధికారులు వివరించారు. కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం , బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఏపీలోని (AP) కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కాకినాడ, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్‌, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వివరించింది.

సోమవారం నాడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మబ్బులు పట్టి రైతులను కంగారు పెట్టింది. అక్కడక్కడా జల్లులు పడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ధాన్యం నిల్వలను కాపాడుకునే పని లో ఉన్నారు. ఈ సమయంలో ధాన్యం తడిస్తే ఎవరూ కొనుగోలు చేయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అకాల వర్షంతో ఉన్న కొద్దిపాటి పంట కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also read: మీ ఆధార్ ఏ బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యింది? ఒక్క క్లిక్ తో తెలుసుకోండిలా..!!

Advertisment
తాజా కథనాలు