Zodiac signs: 30 ఏళ్ల తర్వాత శని సంచారం.. ఈ రాశుల వారికి పట్టబోతున్న అదృష్టం.. చేతిలో డబ్బే డబ్బు!

దాదాపు 30 ఏళ్ల తర్వాత శని గ్రహం సంచారం వల్ల కొన్ని రాశుల వారు చేపట్టిన అన్ని పనుల్లో విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కెరీర్, డబ్బు, చదువు, వ్యాపారం ఇలా అన్ని విధాలుగా కూడా వారికి బాగుంటుంది. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
Zodiac signs that increase luck

Zodiac signs

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల మార్పలు వల్ల రాశిచక్రంలోని కొన్ని రాశుల వారికి మంచి జరగనుందని పండితులు అంటున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత శని గ్రహం సంచారం వల్ల కొన్ని రాశుల వారు చేపట్టిన అన్ని పనుల్లో విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కెరీర్, డబ్బు, చదువు, వ్యాపారం ఇలా అన్ని విధాలుగా కూడా వారికి బాగుంటుంది. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్.. అన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు!

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం ఆర్థికంగా చాలా శుభ ఫలితాలను అందిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన లేదా రావలసిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు.

కన్యా రాశి 
కన్యా రాశి వారికి ఈ సమయంలో శని ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టానికి చేసిన ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ లభించే బలమైన అవకాశం ఉందని చెబుతున్నారు.

ధనుస్సు రాశి 
ధనుస్సు రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం కొత్త అవకాశాలను తెస్తుంది. పాత పెట్టుబడులు నుంచి మంచి లాభం పొందే అవకాశం ఉంది. ఈ సమయం ధనుస్సు రాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. పాత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు.

మకర రాశి
మకర రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శనికి మకరం స్వంత రాశి కావడంతో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్యలు క్లియర్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. నిలిచిపోయిన పనులు తొందరగా అవుతాయి. చాలా కాలంగా సాధించాలనుకున్న పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారని పండితులు అంటున్నారు.

కుంభ రాశి
కుంభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం అదృష్టాన్ని, కీర్తిని తెస్తుంది. పనిచేసే చోట గౌరవం, మంచి గుర్తింపు పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్‌కు బలమైన అవకాశాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. అలాగే జీతం పెరుగుతుందని, వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Tuesday Tips: మంగళవారం రోజు ఈ 6 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Advertisment
తాజా కథనాలు