TS Crime: నెల క్రితమే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే యువకుడు సూసైడ్

పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు కాటికి వెళ్లిపోయాడు. ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న 20 రోజులకే జీవితంపై విరక్తి చెంది సూసైడ్‌ చేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ స్నేహితులకు ఫోన్‌ చేసి నేను చనిపోతున్న అని షాకింగ్‌ విషయం చెప్పిన ఘటన నల్గొండలో కలకలం రేపింది.

New Update
pakala beach

TS Crime

TS Crime: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ యువకుడు సూసైడ్‌ చేసుకున్నాడు. మృతుడిది నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లికి చెందిన కామసాని వేణుగోపాల్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి వేణుగోపాలస్వామి ఆలయ కమాన్‌ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్‌పై వెళ్లాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అతని మిత్రులకు ఫోన్‌ చేసి నేను రైలు కిందపడి చనిపోతున్నట్టు చెప్పాడు. 

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు..

వెంటనే స్పందించిన మిత్రులు అక్కడికి వెళ్లి చూసే వరకు అప్పటికే వేణుగోపాల్‌రెడ్డి చనిపోయి విగత జీవిగా పడి ఉన్నాడు. గ్రామస్తులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి వచ్చారు. ఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడు వేణగోపాల్‌రెడ్డి దక్షిణాఫ్రికాలో బోర్‌వెల్‌ పని చేస్తున్నాడు. వివాహం చేసుకునేందుకు మూడు నెలల కింద సొంతవూరుకు వచ్చాడు. వేణుగోపాల్‌కి ఓ యువతితో 20 రోజుల  క్రితం ఎంగేజ్‌మెంట్‌ కూడా చేశారు కుటుంబ సభ్యులు.

Also  Read: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపమా?

కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన బిడ్డ ఇలా మరణించటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మరణానికి గల కారణలపై ఆరా తీస్తున్నారు. పెళ్లి ఇష్టం లేక ఇలా చేశాడా..? లేక మరేమన్న కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also  Read: చలికాలంలో మడమలు పగులుతున్నాయా?..ఇలా చేయండి

 

Also  Read: ఈ మూడు తింటే కొవ్వంతా కరగాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు