Health Tips: పైల్స్ నొప్పి ఎక్కువైందా.. ఈ యోగాసనాలు చేయండి.

పైల్స్‌తో బాధపడేవారు రోజూ ఈ యోగాసనాలు చేయడం ప్రయోజనాకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.  ఉత్తానాసనం, బౌండ్ కోణం భంగిమ పైల్స్ వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. 

New Update
Uttanasana

Health Tips

Health Tips: ఆహారంలో ఫైబర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవడం, నీరు తక్కువ తాగడం వంటి సమస్యలు పైల్స్‌కు కారణమవుతాయి. పైల్స్ ఉన్నవారిలో మలద్వారం లోపల,  వెలుపల,  పురీషనాళం దిగువ భాగంలో సిరల్లో వాపు, మంట, చికాకు కలుగుతుంది. రక్తస్రావం కూడా ఉంటుంది. మలబద్ధకం, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, ఆహారంలో పీచు లోపం, తక్కువ నీరు తాగడం వంటి సమస్యలు ఉన్నవారు పైల్స్‌తో ఎక్కువ బాధపడే అవకాశం ఉంటుంది. పైల్స్‌ను హెమోరాయిడ్స్ అని కూడా అంటారు. అయితే ప్రతీ రోజు రెండు యోగాసనాలు చేయడం ద్వారా పైల్స్ నొప్పి, మంట నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. 

Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..

పైల్స్ నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు:

బౌండ్ కోణం భంగిమా:

  • బౌండ్ యాంగిల్ భంగిమా అంతర్గత అవయవాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. అలాగే పైల్స్ వల్ల కలిగే అసౌకర్యం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. బౌండ్ యాంగిల్ పోజ్ చేయడానికి, ముందుగా దుప్పటి మీద కూర్చోండి. తర్వాత వీపును నిటారుగా ఉంచుతూ, మీ పాదాల అరికాళ్లను మోకాళ్ల ద్వారా తాకండి.  ఒక నిమిషం శరీరాన్ని ఈ స్థితిలో ఉంచి నెమ్మదిగా విడుదల చేయాలి. 

ఉత్తానాసనం:

  • పైల్స్ ఉన్నవారు ఉత్తానాసనం చేయడం ప్రయోజనాకరంగా ఉంటుంది. ఈ ఆసనం హామ్ స్ట్రింగ్స్,  వెన్నెముకను సాగదీస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  ఉత్తనాసనం చేయడానికి, యోగా మ్యాట్‌పై నిటారుగా నిలబడి, డీప్‌గా శ్వాస తీసుకుని, మీ చేతులను పైకి ఎత్తండి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు వంగి రెండు చేతులతో నేలను తాకించాలి.  చేతులను నేలపై ఉంచేటప్పుడు కాలి వేళ్లను తాకడానికి ప్రయత్నించండి.  మోకాళ్లను నిటారుగా ఉంచండి. ఈ ఆసనం ద్వారా పైల్స్ నొప్పి నుంచి ఉపశమనంతోపాటు మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.

Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్‌ రావు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి: బ్యాచిలర్‌ బాయ్స్ తప్పక చదవాల్సిన న్యూస్‌

 

Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్‌ రావు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు