Diabetes: భయంకర రోగం.. భయంకర పరిస్థితి.. వచ్చే 20ఏళ్లలో జరిగేది ఇదే!

ప్రతీ సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు. అయితే లాన్సెట్ నివేదిక ప్రకారం ఇండియాలో 2021 నాటికి మధుమేహ రోగుల సంఖ్య 74 మిలియన్లు.. మరో 20 ఏళ్లలో ఈ సంఖ్య 125 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

New Update
diabetes (1)

World diabetes Day

World diabetes Day:  ప్రతీ సంవత్సరం నవంబర్ 14ను మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటారు. మధుమేహం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మధుమేహం సంబంధించి చాలా మందిలో ఉండే రకరకాల అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

నేటి సమాజంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలో మధుమేహం వ్యాధి సర్వసాధారణమైపోయింది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య భారతదేశంలో అత్యధికంగా పెరుగుతోంది. ఈ అధ్యయనం ప్రకారం 2022లో సుమారు  828 మిలియన్ల పెద్ద వయసువారు మధుమేహంతో బాధపడుతున్నారు. వారిలో నాల్గొవ వంతు 212 మిలియన్లు మంది భారతదేశంలో నివసించే వారే ఉండడం గమనార్హం. ప్రభుత్వసర్వే లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు 10కోట్ల మంది మధుమేహ రోగులు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం

భారతదేశంలో  అత్యంత వేగంగా.. 

అధ్యయనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి 2022 వరకు పురుషులలో మధుమేహం సంఖ్య  6.8% -14.3% కి, స్త్రీలలో 6.9% నుంచి 13.9%కి వరకు పెరిగింది. ఇండియాలో 1999లో స్త్రీల మధుమేహ సంఖ్య 11.9% ఉండగా.. 2022 నాటికి 24% శాతానికి పెరిగింది. 1999 పురుషుల మధుమేహ సంఖ్య 11.3% ఉండగా 2022 నాటికీ 21.4%కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది.  జపాన్, కెనడా, ఐరోపా వంటి దేశాల్లో మధుమేహ రోగుల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. కొంచెం తగ్గుదల కనిపించింది. 

ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

2045 నాటికి పరిస్థితి మరింత భయంకరం.. 

 అయితే లాన్సెట్ నివేదిక ప్రకారం మరో 20 ఏళ్లలో మధుమేహ రోగుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. 2021 నాటికి భారతదేశంలో 20- 79 ఏళ్ళ మధ్య వయసు గల 74 మిలియన్లు మంది మధుమేహం బారిన పడ్డారు. 2045 వరకు ఈ సంఖ్య  125 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ వ్యాధితో బాధపడేవారు వారు ఎక్కువగా ఉన్నారు. సరైన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. తరచూ అధిక కేలరీలు కలిగిన ఆహారాలు తీసుకోవడం,  జన్యుపరమైన అంశాలు, జీవన శైలి విధానాలు దీనికి కారణం

ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!

Advertisment
Advertisment
తాజా కథనాలు