Typhoid: టైఫాయిడ్‌ మందులకు కూడా ఎందుకు తగ్గడం లేదు?

దేశవ్యాప్తంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా, టైఫాయిడ్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులకు చికిత్స చేయడం చాలా కష్టంగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

Typhoid
New Update

Typhoid: వర్షాకాలం కావడంతో అనేక సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు, ముగ్గురు వైరల్‌ ఫీవర్‌ బారిన పడుతున్నారు. న్యుమోనియా నుంచి టైఫాయిడ్‌ వరకు చాలా వ్యాధులు మందులు వేసుకున్నా కూడా ఎంతకీ తగ్గడం లేదు. మన దేశంలోని అనేక వ్యాధికారక క్రిములు యాంటీబాడీలకు స్పందించవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది. కాలక్రమేణా అనేక రకాల వ్యాధులకు నిరోధకత తగ్గుతోందని ICMR హెచ్చరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మంకీపాక్స్‌లాంటి కొత్త వ్యాధులు మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు ఇలాంటి కొత్త రోగాలతో పాటు ఇప్పటికే ఉన్న వ్యాధులు శరీరంపై దండయాత్ర చేస్తున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ వ్యాధుల సమస్య పెరుగుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది. 

బాక్టీరియా:

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా, టైఫాయిడ్‌లకు కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు ప్రతిస్పందించడం లేదని అంటున్నారు. ఈ వ్యాధులకు చికిత్స చేయడం చాలా కష్టంగా మారిందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. న్యుమోనియా, సెప్సిస్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, డయేరియా వంటి వ్యాధులు యాంటీబయాటిక్స్‌కు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ICMR యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నెట్‌వర్క్ ప్రయత్నించింది. గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. దేశవ్యాప్తంగా 99,492 మంది నుంచి నమూనాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు.

20శాతమే ఫలితాలు:

నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెఫోటాక్సిమ్, సెఫ్టాజిడిమ్, సిప్రోఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్ వంటి ప్రతిరోధకాలు ICU, ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌లో E. కోలి ఇన్‌ఫెక్షన్లకు చికిత్స పొందిన 20శాతం కంటే తక్కువ మంది రోగులలో ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే క్లెబ్సియెల్లా న్యుమోనియా, సూడోమోనాస్ ఎరుగినోసా వంటి అంటువ్యాధులు యాంటీబాడీలకు స్పందించవని తేలింది. దీనిపై టాబ్లెట్స్‌ ప్రభావం కూడా కాలక్రమేణా తగ్గుతుందని పేర్కొంది.

తలనొప్పి:

సాధారణంగా ఉపయోగించే అమికాసిన్, మెరోపెనెమ్ వంటి యాంటీబయాటిక్స్ కూడా వ్యాధిలో చాలా ప్రభావవంతంగా ఉండవు. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫి వంటి బ్యాక్టీరియా ప్రతిరోధకాలపై 95శాతం వరకు పనిచేస్తుంది. దీంతో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రోగులకు వైద్యం చేయడమే పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు.

దీనికి కారణం ఏంటి?

యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఇలా జరుగుతుందని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకోకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వైద్యులు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా శరీరంలోని రోగనిరోధకశక్తిని ఉపయోగించి వ్యాధి నియంత్రణకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఆధునిక వైద్యులు అనేక నగరాల్లో పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం మానేయడం గమనార్హం.

#health
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe