Cancer Causes: డేంజర్..!! వీటిని వాడడం ఆపండి లేదంటే క్యాన్సర్ కన్ఫర్మ్..!

ఇటీవల యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీని వెనుక ప్లాస్టిక్‌ వాడకం, రసాయనాలు, ఆహారం, జీవనశైలి వంటి పర్యావరణ కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ ను అరికట్టాలంటే ఆరోగ్యకర జీవనశైలి పాటించాలని సూచిస్తున్నారు.

New Update
Cancer Causes

Cancer Causes

Cancer Causes: మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో డీఎన్ఏ(DNA) ఉంటుంది. ఇది ఆ కణం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన సూచనలు ఇస్తుంది. కానీ కొన్ని సార్లు డీఎన్ఏలో తప్పులు (మ్యూటేషన్‌లు) వస్తాయి. ఇవి కణం నియంత్రణ లేకుండా పెరగడానికి, చనిపోకుండా ఉండడానికి, లేదా శరీరంలోని ఇతర భాగాలకు చేరేలా చేయగలవు. ఇలా జరిగితే క్యాన్సర్ ఏర్పడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ మ్యూటేషన్‌ల అవకాశం పెరుగుతుంది. అందుకే వృద్ధుల్లో క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read: దీపావళి వేడుకలు.. ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా ఈ వస్తువులు కిచెన్ నుంచి తరిమేయండి!!

యువతలో క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది? (Cancer in Young People)

ఇది చాలా ఆందోళనకరమైన విషయం. దీనికి ప్రధాన కారణాలు పర్యావరణంలో మార్పులు కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పర్యావరణ కారణాలు అంటే మన జీవనశైలి, ఆహారం, వ్యాయామం లేకపోవడం, రసాయనాల తినడం లేదా శ్వాసలోకి రావడం వంటివి. వీటి వల్ల డీఎన్ఏకి నష్టమవుతుంది లేదా డీఎన్ఏలో తప్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

రసాయనాల వాళ్ళ క్యాన్సర్.. (Cancer Caused by Chemicals)

ప్రపంచంలో ఇప్పుడు మనం ఎక్కువగా రసాయనాలు, ప్లాస్టిక్‌లను వాడుతున్నాం. ముఖ్యంగా ప్లాస్టిక్‌లలో ఉండే కొన్ని రసాయనాలు (ఉదాహరణకు PFAS వంటివి) ఆహారంతో కలిసి మన శరీరంలోకి వెళ్తాయి. ఇవి కూడా క్యాన్సర్ కారకాలు కావచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఏ రసాయనం వల్ల ఏ క్యాన్సర్ వస్తుందో చెప్పడం చాలా కష్టం.

Also Read: బియ్యం పిండి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగకరమండి!!

బౌల్ క్యాన్సర్ (కొలన్ క్యాన్సర్) ఉదాహరణగా తీసుకుంటే
పాతికేళ్లలో వృద్ధుల్లో ఈ క్యాన్సర్ తక్కువగా వస్తోంది, కానీ యువతలో మాత్రం పెరుగుతోంది. ప్లాస్టిక్‌ల వల్ల, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, జీవనశైలి వల్ల, బ్యాక్టీరియాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని అంచనా.

Also Read: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!

ఏం చేయాలంటే..? (How to Prevent Cancer)

  • ప్లాస్టిక్‌లను తగ్గించుకోవడం మంచిది
  • ఆరోగ్యకరమైన ఆహారం తినాలి
  • రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి
  • ఆల్కహాల్ తాగడం తగ్గించాలి
  • ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి

అయితే, ఈ క్యాన్సర్ పై ఇంకా అనేక పరిశోధనలు జరుగుతున్నా, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగవుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Advertisment
తాజా కథనాలు