/rtv/media/media_files/2025/10/27/vastu-tips-2025-10-27-16-16-50.jpg)
Vastu Tips
ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు వృద్ధి చెందాలంటే కొన్ని టిప్స్ పాటించాలని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి వారికైనా కూడా ఆర్థిక సమస్యలు సాధారణంగా ఉంటాయి. ఈ సమస్యలు తగ్గించాలంటే ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. అయితే ఏయే నియమాలు పాటించడం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Health Tips: మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఉందా..? నిపుణుల సలహాలు.. పరిష్కార మార్గాలు తెలుసుకోండి!!
సరైన దిశలో అల్మారా
బెడ్‌రూమ్‌లో అల్మారాను నైరుతి దిశలో ఉంచాలి. దాని తలుపులు ఉత్తరం లేదా తూర్పు వైపు తెరిచి ఉండాలి. ఈ దిశలలో ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు ఇంటికి వస్తాయని పండితులు అంటున్నారు. అల్మారాను నైరుతి దిశలో ఉంచడం వల్ల ఎల్లప్పుడూ ఇంట్లో డబ్బు ఉంటుంది. అసలు ఆర్థిక సమస్యలు రావు. అలాగే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
వార్డ్‌రోబ్
బెడ్‌రూమ్‌లో ఆగ్నేయం లేదా వాయువ్య దిశలో వార్డ్‌రోబ్‌ను ఉంచవద్దు. ఈ దిశల ప్రభావం వల్ల మీకు డబ్బు ఆదా కాదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అలాగే మీ బెడ్‌రూమ్ తలుపుల ముందు ఉంచవద్దు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. దీనివల్ల మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా కోల్పోతారని పండితులు అంటున్నారు.
బంగారం లాకర్
డబ్బు, ఆభరణాలతో ఉన్న లాకర్‌ను ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుని నివాసంగా భావిస్తారు. ఆ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చెబుతోంది.
మెట్ల కింద బాత్‌రూమ్
చాలా మంది స్పేస్ కోసం మెట్ల కింద బాత్ రూమ్ కడుతుంటారు. అయితే ఇలా పెట్టడం వల్ల వాస్తు సమస్యలు వస్తాయని, ఇంట్లో ఎక్కువగా ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు.
అల్మారాలో అద్దాలు
వాస్తు ప్రకారం మీ ఇంటి అల్మారాలో అద్దాలు ఉంచుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల సరిగ్గా నిద్రపట్టదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పాత లేదా చిరిగిన బట్టలు అల్మారాలో ఉంచవద్దని పండితులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Follow Us